Tuesday, June 16, 2026
Homeసినిమాప్రభాస్ గురించి అసలు విషయం బయటపెట్టిన కృతి సనన్

ప్రభాస్ గురించి అసలు విషయం బయటపెట్టిన కృతి సనన్

ప్రభాస్ పెళ్లి ఎప్పుడు..? గత కొంతకాలంగా సమాధానం లేని ప్రశ్నగా మారింది. బాహుబలి తర్వాత ప్రభాస్ పెళ్లి అంటూ గతంలో వార్తలు వచ్చాయి. బాహుబలి 1, బాహుబలి 2 వచ్చి వెళ్లిపోయాయి కానీ.. ప్రభాస్ పెళ్లి మాత్రం చేసుకోలేదు. ఇప్పుడు వరుసగా ‘ఆదిపురుష్‌’, ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కే’, మారుతితో మూవీ చేస్తున్నారు. వీటితో పాటు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో కూడా ఓ సినిమా చేయనున్నారు. ‘స్పిరిట్’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టుగా ప్రకటించడం కూడా జరిగింది. ఈ సంవత్సరంలో ఆదిపురుష్‌, సలార్ చిత్రాలు విడుదల చేయనున్నారు.

అయితే.. ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముడుగా నటిస్తే.. కృతి సనన్ సీతగా నటించింది. అప్పటి నుంచి ప్రభాస్, కృతి సనన్ మధ్య స్నేహం పెరిగిందని.. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారిందని… అంతే కాకుండా ప్రేమ కాస్త పరిణయం వరకు వెళ్లిందని బాలీవుడ్ లోను, టాలీవుడ్ లోనూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలు రావడానికి కారణం ఏంటంటే… వరుణ్ ధావన్ ఓ ఇంటర్ వ్యూలో.. కృతి సనన్ మనసులో ప్రభాస్ ఉన్నాడు అన్నట్టుగా ఇన్ డైరెక్ట్ గా చెప్పడంతో ఇదంతా నిజమే అనుకున్నారు.

ఈ విషయం గురించి కృతి సనన్ క్లారిటీ ఇచ్చింది. ప్రభాస్ జ‌స్ట్ ఫ్రెండ్ మాత్రమే.. మిగిలినవన్నీ గాలి వార్తలే అని చెప్పింది. వరుణ్ ధావన్ కామెంట్స్ గురించి ప్రభాస్ తోనే చెప్పి బాధ పడ్డాను అని కృతి సనన్ ఓ ఇంటర్వూలో చెప్పింది. ప్రభాస్ కూడా తనకు ఫోన్ చేసి వరుణ్ ధావన్ ఎందుకు అలా చెప్పాడని అడిగారని.. ఏమో తనకు అలా ఎందుకు అనిపించిందో తనకు తెలియదని క్లారిటీ ఇచ్చిందట. సో.. కృతి సనన్ తో ప్రభాస్ లవ్ లో లేడు అనేది క్లియర్. మరి.. ప్రభాస్ పెళ్లి చేసుకునేది ఎప్పుడు..? సమాధానం లేని ఈ ప్రశ్నకు ప్రభాస్ ఎప్పుడు ఆన్సర్ ఇస్తాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular