Sanan with Tiger:  మాస్ మహారాజా రవితేజ మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు‘ టైటిల్ పోస్టర్‌ తోనే  ఆసక్తిని సృష్టించింది. విమర్శకుల ప్రశంసలు పొందిన, కమర్షియల్ బ్లాక్‌ బస్టర్ చిత్రం ది కాశ్మీర్ ఫైల్స్‌ ను రూపొందించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ నిర్మిస్తున్న చిత్ర‌మిది. ఈ చిత్రం రవితేజ కెరీర్‌ లోనే అత్యధిక బడ్జెట్‌ తో భారీ స్థాయిలో నిర్మించబడుతుంది. ఇది నిర్మాత కు అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్. తేజ్ నారాయణ్ అగర్వాల్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

ఈ సినిమాలో రవితేజ సరసన బాలీవుడ్ నటి నూపూర్ సనన్ ను ఎంపిక‌చేశారు.  విద్యావంతుల కుటుంబం నుంచి వ‌చ్చిన‌ నూపూర్ త‌న సోదరి కృతి సనన్ నే ఓ రోల్ మోడ‌ల్‌గా తీసుకుంది. తెలుగులో టైగర్ నాగేశ్వరరావు తోనే నూపూర్  అరంగేట్రం చేస్తోంది. గతంలో అక్షయ్ కుమార్‌ తో కలిసి ఓ మ్యూజిక్ వీడియోలో కనిపించిన నూపూర్‌ కి ఇదే తొలి చిత్రం కావ‌డం విశేషం.

మాదాపూర్‌లోని నోవాటెల్‌ లో (హెచ్‌ ఐ సిసి)లో టైగర్ నాగేశ్వరరావు చిత్రాన్ని ఉగాది రోజున (ఏప్రిల్ 2వ తేదీ) ప్రారంభించ నున్నారు. అదే రోజు సినిమా ప్రీ లుక్‌ని కూడా విడుదల చేయనున్నారు. పవర్ ఫుల్ స్క్రిప్ట్ అందించిన వంశీ,  ఈ సినిమాలో రవితేజను  పూర్తిగా మాస్ లుక్‌ లో చూపించ‌బోతున్నాడు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రూపొందనుంది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండ‌గా, ఆర్ మదీ ఐఎస్‌సి సినిమాటోగ్రఫీని నిర్వ‌హిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ కాగా, శ్రీకాంత్ విస్సా డైలాగ్ రైటర్, మయాంక్ సింఘానియా సహ నిర్మాత.

Also Read : రవితేజ పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘టైగర్ నాగేశ్వరరావు’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *