Saturday, June 13, 2026
Homeసినిమాఆ అమ్మాయికి అప్పుడే రెండు ఫ్లాపులు!

ఆ అమ్మాయికి అప్పుడే రెండు ఫ్లాపులు!

టాలీవుడ్ కి ఈ మధ్య కాలంలో పరిచయమైన అందాల కథానాయికలలో కృతి శెట్టి ఒకరు. ‘ఉప్పెన’ వంటి బ్లక్ బస్టర్ హిట్ తోనే తాను గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. తెరపై ఈ పిల్లను చూసిన కుర్రాళ్లంతా పిప్పరమెంటులా ఉందే అనుకున్నారు. ఆలస్యం చేయకుండా ఆమె అభిమానులుగా మారిపోయారు. ఇకపై ఈ అమ్మాయి ఏ సినిమా చేసినా మొదటి ఆటనే చూసేయాలని తీర్మానించుకున్నారు. ఆ తరువాత కూడా ఈ అమ్మాయి చేసిన ‘శ్యామ్ సింగ రాయ్’ .. ‘బంగార్రాజు’  సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలను నమోదు చేశాయి.

దాంతో కృతి అందంతో పాటు అదృష్టాన్ని కలుపుకునే ఎంట్రీ ఇచ్చిందని అంతా చెప్పుకున్నారు. ముద్దుగా .. ముచ్చటగా కనిపించే కృతి మంచి మాటకారినే. సినిమాల ఎంపిక విషయంలో కూడా తెలివిగానే ప్లాన్ చేసుకుంది. యంగ్ స్టార్ హీరోలుగా వెలిగిపోతున్న రామ్ జోడీగా ‘ది వారియర్’ .. నితిన్ సరసన ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాలు చేసింది. చాలా తక్కువ గ్యాపులో థియేటర్లకు వచ్చిన ఈ సినిమాలు అభిమానులను పూర్తిగా నిరాశపరిచాయి. దాంతో ఇప్పుడు ఈ అమ్మాయి ఆలోచనలో పడిందని అంటున్నారు.

ఇక ఇప్పుడు కృతి నుంచి రావలసిన సినిమా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ మాత్రమే. ఇంద్రగంటి దర్శకత్వంలో సుధీర్ బాబు జోడీగా ఆమె ఈ సినిమా చేసింది. ఈ సినిమాపైనే కృతి ఇప్పుడు ఆశలు పెట్టుకుంది. ‘బంగార్రాజు’ తరువాత ఈ సినిమా వచ్చి ఉంటే బాగుండేది. కానీ కృతికి రెండు ఫ్లాపులు పడిన తరువాత ఈ సినిమా విడుదల కానుంది. ఈ కథ అంతా కూడా కృతి చుట్టూనే తిరగనుంది. ఈ సినిమా హిట్ అయితే కృతి దార్లో పడిపోతుంది. లేదంటే కాస్త ఇబ్బందుల్లోనే పడుతుంది. ఇకపై ఆమె ఎంపిక చేసుకునే కొత్త ప్రాజెక్టులు ఎలా ఉంటాయనేది చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular