Thursday, March 12, 2026
Homeసినిమాకృతి శెట్టి కున్న భయం ఏమిటి?

కృతి శెట్టి కున్న భయం ఏమిటి?

Krithi Shetty: తెలుగు తెరకు కథానాయికలుగా ఇంతకుముందు చాలామంది అందగత్తెలు పరిచయమయ్యారు. ఎవరి ప్రతిభను వారు .. ఎవరి ప్రత్యేకతను వారు చూపించారు. క్రితం ఏడాది టాలీవుడ్ కి పరిచయమైన కథానాయికలలో ముద్దబంతులు వంటి ముద్దుగుమ్మలు ముగ్గురు మాత్రమే యూత్ దృష్టికి వెళ్లారు. వాళ్ల జాబితాలో కృతి శెట్టి .. శ్రీలీల .. అనన్య పాండే కనిపిస్తారు. ఈ ముగ్గురిలో ముద్దమందారంలా కనిపించే కృతి శెట్టి కెరియర్ పరంగా ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. ఆమె రెండవ సినిమా అయిన ‘శ్యామ్ సింగ రాయ్’కి కూడా మంచి వసూళ్లను రాబడుతోంది.

తాజా ఇంటర్వ్యూలో కృతి శెట్టి మాట్లాడుతూ .. ‘ఉప్పెన’ సినిమాలో బేబమ్మ పాత్ర తరువాత అందుకు పూర్తి భిన్నమైన పాత్రను చేయాలనుకున్నాను. అలాంటి పరిస్థితుల్లోనే నాకు ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాలో కీర్తి పాత్రను చేసే అవకాశం లభించింది. ఆ పాత్ర నాకు చాలా కొత్తగా అనిపించింది .. అందువలన ఒప్పుకున్నాను. ఈ సినిమా కథ విన్నప్పుడు .. ఈ సినిమాకి సంబంధించి నానిగారు గారు చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నప్పుడు తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం కలిగింది. కొత్త కథ ఏది నా దగ్గరికి వచ్చినా నాతో పాటు మా అమ్మగారు కూడా వింటుంది. తనకి కథ నచ్చితేనే నేను చేయడం జరుగుతుంది. కథ వింటున్నప్పుడే మా అమ్మకి నచ్చిందా లేదా అనే విషయం ఆమె ఎక్స్ ప్రెషన్స్ వలన నాకు తెలిసిపోతుంటుంది.

సాధారణంగా ప్రతి ఒక్కరిలోను ఏదో ఒక భయం ఉంటూ ఉంటుంది .. అలా కృతికి ఏ భయం ఉంది? అని యాంకర్ అడిగిన ప్రశ్నకి ఆమె సమాధానం చెబుతూ .. “నాకు హైట్స్ ఫోబియా ఉంది .. పడిపోతానేమోనని భయపడుతూ ఉంటాను. అందువలన నిదానంగా నడుస్తుంటాను. అందరూ కూడా ఎందుకు అంత మెల్లగా నడుస్తుంటావ్ అని నన్ను టీజ్ చేస్తుంటారు. బహుశా చిన్నప్పుడు పడిపోవడం వలన ఆ భయం అలా ఉండిపోయిందేమో! అంటూ చెప్పుకొచ్చింది.

Also Read : నాకు ఆ ఆలోచన లేదు : హీరోయిన్ కృతి శెట్టి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular