Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

3 days practice for smoking: నేచురల్ స్టార్ నాని న‌టించిన లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగ రాయ్’. ఈ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై  వెంకట్ బోయనపల్లి నిర్మించారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వ‌హించారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ సంద‌ర్భంగా హీరోయిన్ కృతి శెట్టి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆమె మాట‌ల్లోనే..

ఉప్పెన, శ్యామ్ సింగ రాయ్ సినిమాల్లోని పాత్రలకు చాలా తేడా ఉంది. బేబమ్మ పాత్ర కోసం చాలా తెలుగు సినిమాలను చూశాను. ట్రెడిషన్, కల్చర్ గురించి తెలియాలి. విలేజ్ అమ్మాయిలు ఎలా ఉంటారో తెలీదు. శ్యామ్ సింగ రాయ్ సినిమా కోసం ఇంగ్లీష్ సినిమాలు, మోడ్రన్ అమ్మాయిలు ఎలా ఉంటారో తెలుసుకుని, నా స్టైల్లో నటించాను. నాకు వచ్చే పాత్రల పై నేనే రీసెర్చ్ చేసుకుంటాను. ఆ కారెక్టర్ ఎలా ఉంటుంది. ఆమె అలవాట్లు ఏంటి.? ఆమె ఎలాంటి పాటలు వింటుంది.? అని నేనే సపరేట్‌గా రాసుకుంటాను. శ్యామ్ సింగ రాయ్ సినిమాలో కీర్తి పాత్రకు తల్లి ఉండదు. తండ్రి పెంపకంలోనే పెరుగుతుంది. అప్పుడు కాస్త మగరాయుడిలా ఉంటే బాగుంటుందని దర్శకుడికి చెప్పాను.

Nanu Duel Roles

నాకు స్మోకింగ్ అంటే నచ్చదు. కానీ ఈ పాత్ర కోసం అదే చాలెంజింగ్‌గా అనిపించింది. ఆ సీన్స్ తీసేయోచ్చా? అని దర్శకుడిని కోరాను. అది కీర్తి, నువ్ కృతి. తేడా ఉండాలి కదా? అని దర్శకుడు అన్నారు. ఆరోగ్య సేతు సిగరెట్లను తీసుకొచ్చారు. దాంట్లో ఓన్లీ మిల్క్ టేస్ట్ ఉంటుంది. సిగరెట్లను తాగడం మూడు రోజులు ప్రాక్టీస్ చేశాను. మొదటి రోజు ఫోటో షూట్ చేసేటప్పుడు నా చేతులు వణికిపోయాయి. నాకు పెయింటింగ్ అంతగా రాదు. అంత పర్ఫెక్ట్‌ గా పెయింట్ వేయలేను. మైండ్ ఫ్రీ అయ్యేందుకు పెయింటింగ్‌లాంటివి ఏదో ఒకటి చేయాలి. నాని గారితో నటించడం అంటే మొదట్లో నాకు భయం వేసింది. కానీ ఆయన సెట్‌లొ ఎంతో ప్రోత్సహించేవారు. ఆయన వరకు మాత్రమే కాకుండా ప్రతీ ఒక్కరి పర్ఫామెన్స్ చూస్తారు. బాగుందని అంటారు. ఆయన ఇచ్చిన సపోర్ట్ వల్లే అంత కంఫర్ట్‌ గా నటించగలిగాను.

బోల్డ్ సీన్స్ అంటే అంతా బ్యాడ్ అని అనుకుంటారు. ఏం చేసినా కూడా వృత్తి పరంగానే మేం చేస్తాం. యాక్షన్ సీక్వెన్స్‌ లో ఎంత కష్టపడతారో అన్ని సీన్లకు అలానే కష్టపడతారు. అన్ని సీన్లలోనూ నటించినట్టే ఆ సన్నివేశాల్లోనూ నటిస్తాను. ఇండస్ట్రీలోకి రాకముందు నేను ఎక్కువగా సినిమాలు చూడలేదు. కథలో ఆ సీన్స్ అవసరం అనిపిస్తేనే చేస్తాను. లేదంటే నేను చేయను. శ్యామ్ సింగ రాయ్‌లో వాటితో కథ ముడి పడి ఉంది. నా ఫ్యామిలీ అంతా ఒక్కో చోట ఉంటారు. సినిమా టికెట్లను నాకు చూపించారు. సినిమాకు వెళ్తున్నామని చెప్పారు. మా నాన్న సినిమాను చూసి నన్ను మెచ్చుకున్నారు. బాగా చేశావ్ అని అన్నారు. ఆయన ఎప్పుడూ కూడా సెట్‌లోకి రారు. నా లుక్ గురించి తెలీదు. కొత్తగా, ఫ్రెష్‌గా ఉందని అన్నారు.

సాయి పల్లవి పాత్ర నాకు చాలా నచ్చింది. నేను కూడా కూచిపూడి డ్యాన్స్ నేర్చుకుంటున్నాను. ఆమె స్క్రీన్ మీద చాలా బాగా చేశారనిపించింది. నేను సెట్‌లో సాయి పల్లవిని కలవలేదు. ఓ సారి సెట్‌కు వెళ్లాను గానీ ఆ రోజు సాయి పల్లవి షూటింగ్ లేదు. నానిని అందరూ నాచురల్ స్టార్ అంటారు. ఆయన ఏ పాత్రను చేసినా ఆ పాత్రలోకి వెళ్లిపోతారు. ఆ కారెక్టర్‌ను అంత న్యాచురల్‌గా చేస్తారు. శ్యామ్ సింగ రాయ్ సినిమాల్లోని రెండు పాత్రల్లోనూ వేరియేషన్ ఉంటుంది. నాకు వాసు అంటేనే ఇష్టం. మిడిల్ క్లాస్ అబ్బాయి, నిన్ను కోరి సినిమాల్లోని నాని అంటే ఇష్టం.

బంగార్రాజు షూటింగ్ నిన్ననే పూర్తయింది. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఫిబ్రవరిలో వస్తుందేమో. మాచర్ల నియోజకవర్గం చిత్రం ఏప్రిల్ లో  వస్తుంది. రామ్‌తో సినిమా ఇంకా షూటింగ్ జరుగుతోంది. బాలీవుడ్ నుంచి ఇంకా ఆఫర్లు రాలేదు. నాకు ఆ ఆలోచన కూడా లేదు. నాకు ఇక్కడే ఇంత ప్రేమ దొరుకుతోంది. ఇక్కడే ఉండాలనిపిస్తోంది. సుకుమార్ గారితో పని చేయడం ఆనందంగా ఉంటుంది. ఆయన్ను చాలా సార్లు కలిశాను. ఆయనతో పని చేస్తే మంచి ఎక్స్‌ పీరియెన్స్ వస్తుంది.

Also Read :  నేను క‌నిపించ‌ను – దేవదాసి పాత్రే కనపడుతుంది : సాయి ప‌ల్ల‌వి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com