Monday, June 8, 2026
Homeసినిమాపాట చిత్రీకరణలో  ‘బంగార్రాజు’

పాట చిత్రీకరణలో  ‘బంగార్రాజు’

Mass song of Bangarraju: కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో రాబోతోన్న క్రేజీ మూవీ బంగార్రాజు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావొస్తుంది. అన్నపూర్ణ స్టూడియోలో వేసిన భారీ సెట్‌లో నాగ చైతన్య, కృతిశెట్టిలపై పాటను చిత్రీకరించనున్నారు. నేటితో ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది. ఇదే విషయాన్ని నాగార్జున ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. చివరి రోజు షూటింగ్.. మరో పెప్పీ మాస్ సాంగ్ రెడీ అవుతోంది.. పండగ లాంటి సినిమా.. బంగార్రాజు త్వరలోనే రాబోతోంది అని ట్వీట్ వేశారు.

దీంతో పాటు నాగార్జున ఓ ఫోటోను షేర్ చేశారు. అందులో చిన్న బంగార్రాజుగా పంచెకట్టులో నాగ చైతన్య మెరిశారు. ఇక కృతి శెట్టి హాట్ లుక్‌లో అదిరిపోయారు. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో రాబోతోన్న ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. 2022లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అనూప్ రూబెన్స్ సంగీత సారథ్యంలో మ్యూజిక్ ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు. ఇందులో భాగంగా విడుదల చేసిన పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అంటూ వాసివాడి తస్సాదియ్య అనే పాటకు అద్భుతమైన స్పందన వచ్చింది.

నాగార్జున, నాగ చైతన్య కలిసి ఇందులు స్టెప్పులు వేయగా.. ఫరియా అబ్దుల్లా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు ప్రీక్వెల్‌గా రాబోతోన్న ఈ ‘బంగార్రాజు’ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Also Read  : ‘బంగార్రాజు’.. క్లారిటీ వ‌చ్చేది ఎప్పుడు.?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular