Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

No tension- Nani: నేచురల్ స్టార్ నాని న‌టించిన తాజా చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటించారు. రేపు (డిసెంబర్ 24న) ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా శ్యామ్ సింగ రాయ్ యూనిట్ మీడియాతో ముచ్చటించింది.

ఈ కార్యక్రమంలో నాని మాట్లాడుతూ… రిలీజ్‌కు ముందు మీడియాకు థ్యాంక్స్ చెప్పాలని ఈ ఈవెంట్‌ను ఏర్పాటు చేశాం. మమ్మల్ని మొదటి నుంచి సపోర్ట్ చేస్తూనే వస్తున్నారు. రిలీజ్ ముందు రోజు చాలా టెన్షన్ ఉంటుంది కానీ.. ఓ మంచి సినిమా తీశామనే ఓ ఫీలింగ్ మాత్రం ఉంది. సినిమా చూశాక ఆడియెన్స్ ఎలా ఫీల్ అవుతారా? అని గత రెండ్రోజుల నుంచి ఆలోచిస్తూనే ఉన్నాను. యూఎస్‌లో ప్రీమియర్స్ పడతాయి. వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఈ సినిమా ఉంటుంది. అందుకోసం ప్రతీ ఒక్క టీం మెంబర్ కష్టపడ్డారు. ఈ సినిమాను దక్షిణాది భాషల్లో విడుదల చేస్తున్నాం.

Nani On Shyam Singha Roy

ఈ సినిమాలో చాలా కొత్త విషయాలున్నాయి. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సినిమా ఇదే అవుతుంది. ఫస్ట్ కథ విన్నప్పుడే అలాంటి అనుభూతి క‌లిగింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. అన్ని రకాల జానర్లు ఇందులో ఉంటాయి. ఇందులో ఎమోషనల్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. వాసు నార్మల్ కారెక్టర్. శ్యామ్ ప్రపంచం వేరు. నేను కూడా ఓ ప్రేక్షకుడినే. నాకు నచ్చింది ప్రేక్షకుడికి నచ్చుతుందనిపిస్తుంది. అందుకే కొత్త సినిమాలు చేయాలని అనిపిస్తుంది. సినిమాను ఎంత బాగా చూపించామనేది ముఖ్యం.

ఆ ప్రపంచంలోకి తీసుకెళ్లామా? లేదా? అనేదే ప్రేక్షకులు చూస్తారు. ఏ భాషలోని ప్రేక్షకులు చూసినా కూడా భాషలో తప్పు కనిపించకూడదని బెంగాలీ భాషను నేర్చుకున్నాను. డైలాగ్స్ చెప్పాను. కెమెరామెన్, ఆర్ట్, క్యాస్టూమ్ డిపార్ట్మెంట్ వల్లే నాకు శ్యామ్ సింగ రాయ్ అనే ఫీలింగ్ వచ్చింది. సినిమా హిట్ అవుతుందనే అందరూ చెబుతారు. నేను కూడా అదే చెబుతున్నాను. కానీ ఎంతో నమ్మకంగా,కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాను.

Nanu Duel Roles

ఎన్ని అంచనాలు పెట్టుకున్నా సరే దాన్ని దాటే సినిమాను చేశామని నేను అనుకుంటున్నాను. ఓటీటీలో రిలీజ్ చేసిన సినిమాల పట్ల నిర్మాతలు, నేను అందరం హ్యాపీగానే ఉన్నాం. అప్పుడు ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఓటీటీలో రిలీజ్ చేశాం. కానీ ఇప్పుడు ప్రేక్షకులు థియేటర్లోకి వస్తున్నారు. అందుకే ఎంత మంది చూస్తారో చూడండి. నష్టపోతే మేం నష్టపోతాం. లెక్కలు తరువాత చూసుకుందాం… అన్నారు.

Also Read : ‘శ్యామ్ సింగ‌రాయ్’ తో క్రిస్మస్ మ‌న‌దే : నాని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com