Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Release of Bangarraju: సంక్రాంతికి ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ సినిమాలు విడుద‌లవుతున్నాయి. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ‘భీమ్లా నాయ‌క్’ని కూడా సంక్రాంతికి విడుద‌ల చేయ‌నున్న‌ట్టుగా ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ.. సంక్రాంతి రేసు నుంచి త‌ప్పుకుంది. ఫిబ్ర‌వ‌రి 25కి భీమ్లా నాయ‌క్ వాయిదా ప‌డింది. దీంతో ఆర్ఆర్ఆర్ మూవీకి లైన్ క్లియ‌ర్ అయ్యింది. భీమ్లా నాయ‌క్ వాయిదా ప‌డ‌డంతో బంగార్రాజు సంక్రాంతికి రావ‌డం ఖాయమని, జ‌న‌వ‌రి 15న విడుద‌ల అని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇది దాదాపుగా క‌న్ ఫ‌ర్మ్. అఫిషియ‌ల్ అనౌన్స్ మెంట్ రావ‌డ‌మే ఆల‌స్యం అంటున్నారు సినీ జ‌నాలు. అయిన‌ప్ప‌టికీ.. ‘బంగార్రాజు’ విడుద‌ల తేదీ ఇంకా ప్ర‌క‌టించ‌క‌పోవ‌డంతో టెన్ష‌న్ స్టార్ట్ అయ్యింది. అక్కినేని అభిమానులు రిలీజ్ డేట్ ప్ర‌క‌టించాలని తొంద‌ర‌పెడుతున్నారు కానీ.. నాగార్జున మాత్రం ఇంకా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయ‌లేదు. దీంతో అస‌లు బంగార్రాజు సంక్రాంతికి వ‌స్తుందా.?  వాయిదా ప‌డుతుందా..? అనే అనుమానాలు మొద‌ల‌య్యాయి. అస‌లు ఏం జ‌రుగుతుంది అని ఆరా తీస్తే.. రెండు రోజుల్లో షూటింగ్ మొత్తం పూర్త‌వుతుంద‌ట‌. ఆ త‌ర్వాత రిలీజ్ డేట్ ప్ర‌క‌టిస్తార‌ని స‌మాచారం. మ‌రి.. ప్ర‌చారంలో ఉన్న‌ట్టుగా జ‌న‌వ‌రి 15న బంగార్రాజు విడుద‌ల అని అనౌన్స్ చేస్తారేమో చూడాలి.

Also Read : ఎన్టీఆర్, చ‌ర‌ణ్ ల పై స‌ల్మాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com