Friday, March 29, 2024
Homeసినిమాఎన్టీఆర్, చ‌ర‌ణ్ ల పై స‌ల్మాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఎన్టీఆర్, చ‌ర‌ణ్ ల పై స‌ల్మాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Salman Comments: ఆర్ఆర్ఆర్.. యావ‌త్ దేశంలో ఉన్న సినీ అభిమానులంద‌రూ ఎంతో ఆతృత‌గా ఎదురు చూస్తోన్న సినిమా. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల క్రేజీ కాంబినేష‌న్లో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఈ భారీ చిత్రాన్ని భారీ చిత్రాల నిర్మాత డివివి దాన‌య్య అత్యంత‌ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న ఆర్ఆర్ఆర్ ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యింది. ఈ సంద‌ర్భంగా ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబాయిలో క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో చాలా గ్రాండ్ గా జ‌రిగింది.

ఈ వేడుకకు బాలీవుడ్‌ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్‌ ముఖ్య అతిధిగా హాజ‌ర‌య్యారు. ముఖ్యంగా జిలుగుల వెలుగు కాంతిలో క్రేన్‌ తో అమ‌ర్చిన స్పెష‌ల్ వెహికిల్ లో స‌ల్మాన్ ఎంట్రీ ఇవ్వడం అదిరింది. ఇక స్టేజ్‌ పై సల్మాన్ ఖాన్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రబృందం పై ప్ర‌శంస‌ల‌ వర్షం కురిపించాడు. ఇంత‌కీ సల్మాన్ ఖాన్ ఏం మాట్లాడాడు అంటే.. ఎన్టీఆర్ న‌ట‌న‌ను నేను ఎంతో ఇష్ట‌ప‌డ‌తాను. అలాగే రామ్ చ‌ర‌ణ్‌ లా హార్డ్ వ‌ర్కింగ్ ప‌ర్స‌న్‌ ను నేను చూడ‌లేదు. ఆర్ఆర్ఆర్ కోసం ఎంటైర్ ఇండియా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది.

ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధిస్తుంది. ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయిన మరో నాలుగు నెలల వరకు ఏ సినిమా రిలీజ్ కాకుండా ఉంటే బాగుంటుంది అని సల్మాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం విశేషం. ఆర్ఆర్ఆర్ గురించి స‌ల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. స‌ల్మాన్ వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి అర్ధం చేసుకోవ‌చ్చు ఆర్ఆర్ఆర్ పై ఎంత‌టి క్రేజ్ ఉందో. మ‌రి.. ఆర్ఆర్ఆర్.. ఏ రేంజ్ స‌క్స‌స్ సాధిస్తుందో.. ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Also Read : స‌రికొత్త రికార్డుల సాధిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ ట్రైల‌ర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్