RRR Trailer Records:
‘బాహుబ‌లి’ తో చ‌రిత్ర సృష్టించిన ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ల క్రేజీ కాంబినేష‌న్లో రూపొందిన ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. నిన్న విడుదల చేసిన ట్రైల‌ర్ కు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి ట్రెమండ‌స్ రెస్పాన్స్ లభిస్తోంది. అంత‌కు మించి అన్న‌ట్టుగా.. అంచ‌నాల‌కు మించి ఈ ట్రైల‌ర్ ఉంది.

మొదట థియేటర్లలో రిలీజ్ చేశారు. ఆ త‌ర్వాత‌ యూట్యూబ్ లో కూడా రిలీజ్ చేయ‌గా రికార్డులు తిరగరాస్తూ దూసుకెళ్తుంది. అయితే.. మన తెలుగు వెర్షన్ కి వస్తే మాత్రం ఎన్టీఆర్ అభిమానులు, చరణ్ అభిమానులు ఫాస్టెస్ట్ రికార్డ్ సెట్ చేసి పెట్టారు. కేవలం 7 గంటల్లోనే టాలీవుడ్ ఫాస్టెస్ట్ 1 మిలియన్ లైక్డ్ ట్రైలర్ గా ఆల్ టైం నెంబర్ 1 ప్లేస్ లో నిల‌బెట్టారు. అలాగే 20 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి దూసుకుంటూ వెళుతుంది.

అయితే.. ఇక్కడ హిందీ వెర్షన్ ట్రైలర్ కి కూడా బాలీవుడ్ జనాలు తెలుగుతో సమానమైన రెస్పాన్స్ ని ఈ ట్రైలర్ కి ఇస్తున్నారు. అల్రెడీ 17 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి అక్కడ కూడా భారీ రెస్పాన్స్ ని ఈ ట్రైలర్ కొల్లగొడుతుంది. మొత్తానికి అందరి అంచనాలకు రీచ్ అయ్యి ట్రైలర్ తో సినిమా ఇంకో స్థాయికి వెళ్ళింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గ‌ర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Also Read : ‘ఆర్ఆర్ఆర్’ చ‌రిత్ర సృష్టించ‌డం ఖాయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *