Monday, May 20, 2024
Homeసినిమా#Sharwa35: ఈ సినిమా అయినా కృతి శెట్టికి కలిసొచ్చేనా..?

#Sharwa35: ఈ సినిమా అయినా కృతి శెట్టికి కలిసొచ్చేనా..?

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ కృతి శెట్టి. తొలి చిత్రంతోనే అందం, అభినయంతో ఆకట్టుకుని మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆతర్వాత ‘బంగార్రాజు’, ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రాలతో వరుసగా సక్సెస్ సాధించడంతో మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే.. ఆతర్వాత కృతి నటించిన ‘ది వారియర్’, ‘మాచర్ల నియోజకవర్గం’, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ‘కస్టడీ’ చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో అవకాశాలు బాగా తగ్గాయి. ఆమె చేతిలో ఓ మలయాళం సినిమా మాత్రమే ఉంది.

కృతి శెట్టి ప్రస్తుతం నటిస్తున్న శర్వా సినిమా పైనే ఆశలు పెట్టుకుంది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వరుస సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మిస్తోంది. ఈ సంస్థ శర్వా, కృతి కాంబో మూవీని చిత్రాన్ని నిర్మిస్తుంది. భలే మంచి రోజు, శమంతకమణి, దేవ్ దాస్, హీరో చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈరోజు కృతి శెట్టి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

ఈ వీడియోలో కృతి శెట్టి అందంగా, క్యూట్ గా కనిపిస్తూ అందర్నీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఒక షెడ్యూల్ మినహా మిగతా షూటింగ్ మొత్తం పూర్తయింది. అక్టోబర్ నుంచి ప్రచార కార్యక్రమాల వేగం పెంచనున్నారు. ఇంట్రెస్టింగ్ పాత్రలో శర్వానంద్ ఈ చిత్రంలో కనిపించనున్నారు.హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ చేస్తుండగా, ప్రవీణ్ పూడి ఎడిటింగ్ చేస్తున్నారు.జానీ షేక్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. మరి.. ఈ సినిమాతో అయినా కృతి మళ్ళీ ఫామ్ లోకి వస్తుందేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్