Tuesday, January 21, 2025
Homeసినిమాలేడీ ఓరియంట్ మూవీలో కృతి శెట్టి

లేడీ ఓరియంట్ మూవీలో కృతి శెట్టి

Krithi in Susmitha’s movie: ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది కృతిశెట్టి. త‌న అందం, అభిన‌యంతో తొలి సినిమాతోనే ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. వ‌రుస‌గా అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుంటుంది. ఉప్పెన త‌ర్వాత కృతి శెట్టి న‌టించిన ‘శ్యామ్ సింగ రాయ్’ ఇటీవల ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర విజ‌యం సాధించ‌డంతో ఈ భామకు డిమాండ్ బాగా పెరిగింది. నాగార్జున‌, నాగ‌చైత‌న్యలతో క‌లిసి కృతి న‌టించిన ‘బంగార్రాజు’ సంక్రాంతికి విడుదలవుతోంది.  ఇందులో నాగ‌చైత‌న్య స‌ర‌స‌న న‌టించింది. ఈ సినిమాలో కృతిశెట్టి పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంద‌ని.. ప్ర‌తి అమ్మాయికి బాగా క‌నెక్ట్ అవుతుంద‌ని అంటున్నారు. రామ్ తో క‌లిసి ఓ సినిమాలో న‌టిస్తుంది.

ఇప్పుడు ఈ అమ్మ‌డు మెగా బ్యాన‌ర్ లో న‌టించే అవ‌కాశం ద‌క్కించుకుంద‌ని స‌మాచారం. చిరంజీవి కుమార్తె సుస్మిత నిర్మాత‌గా మారిన సంగతి తెలిసిందే. త‌న బ్యాన‌ర్‌లో కొత్త కొత్త సినిమాలు రూపొంద‌నున్నాయి. ‘ఉయ్యాల జంపాల‌’తో ఆక‌ట్టుకున్న విరించి వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో సుస్మితా ఓ సినిమాను నిర్మిస్తుంది. ఇదో లేడీ ఓరియెంటెడ్ చిత్ర‌మని, క‌థానాయిక‌గా కృతిని ఎంచుకున్నార‌ని స‌మాచారం. అయితే.. ఇది సీరియ‌స్ డ్రామా కాద‌ట‌. ఈత‌రం అమ్మాయిలాంటి పాత్ర కావ‌డంతో ఈ సినిమా చేసేందుకు ఓకే చెప్పింద‌ట‌. మొత్తానికి కృతి వ‌రుస‌గా క్రేజీ ఆఫ‌ర్స్ ద‌క్కించుకుంటూ దూసుకెళుతుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్