Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Bangarraju: కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతిశెట్టి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘బంగార్రాజు’. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లలో విడుద‌లకానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా బంగార్రాజు మ్యూజికల్ ఈవెంట్‌ను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతూ “అభిమానులందరినీ ఇక్కడకు పిలవలేకపోయాం. అందరూ క్షమించండి. జనవరి 14న ఈ చిత్రం రిలీజ్ కానుంది. అన్నపూర్ణ స్టూడియోకు అది చాలా ముఖ్యమైన తేది. అదే రోజున అన్నపూర్ణ స్టూడియోస్ పుట్టింది. దసరా బుల్లోడు అనే సినిమాతో యాభై ఏళ్ల క్రితం నాన్న గారు సంక్రాంతికి దుమ్ములేపారు. అది కూడా మ్యూజికల్ హిట్. సక్సెస్ మీట్‌లో అందరికీ థ్యాంక్స్ చెబుతాను. సినిమాకు సగం సక్సెస్ మ్యూజిక్. ఆ సగం సక్సెస్‌ను అనూప్‌కు ఇస్తున్నాం. చక్కటి మాస్ కమర్షియల్ సాంగ్ ఇచ్చారు. ప్రతీ సాంగ్ ఓ వజ్రంలా ఉంటుంది. సూపర్ హిట్ ఆల్బమ్. లిరిక్ రైటర్స్ మంచి సాహిత్యాన్ని ఇచ్చారు. తెలుగు భాష ఉన్నంత వరకు సాహిత్యం ఉంటుంది. ఎంత ఊహించారో అంతకన్నా ఎక్కువే ఉంటుంది. జనవరి 11న ట్రైలర్ రాబోతోంది. జనవరి 14న పండుగ రోజున పండుగలాంటి సినిమాను తీసుకొస్తున్నాం. అందరూ ఆదరించండి” అన్నారు.

నాగ చైతన్య మాట్లాడుతూ “మనం సినిమాకు ఇలాంటి ఫంక్షన్ చేశాం. బంగార్రాజుకు మళ్లీ ఇలా చేయడం ఆనందంగా ఉంది. ఆడియోను పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్. ఇప్పుడు ఒక్క పాట హిట్ అయితే ఓపెనింగ్స్ అదిరిపోతాయి. అలాంటిది ఈ సినిమా కోసం అనూప్ అద్బుతమైన ఆల్బమ్ ఇచ్చారు. అనూప్ అన్నపూర్ణలో చేసిన ప్రతీ సినిమా, ఆల్బమ్ హిట్ అయింది. ప్రతీ ఒక్కరి ఇన్ పుట్స్ తీసుకునేవారు. మా లిరిక్ రైటర్స్ అందరికీ థ్యాంక్స్. ఇది పండుగ లాంటి సినిమా. ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరితో కలిసి సినిమా చూసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది. బంగారం లాంటి పాత్ర ఇచ్చినందుకు నాన్నకు, కళ్యాణ్ కృష్ణకు థ్యాంక్స్. అంచనాలకు తగ్గట్టుగానే సినిమా ఉంటుంది” అని అన్నారు.

Also Read : గంగా ప్రవాహం ఆయన గానం….

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com