Monday, June 8, 2026
HomeTrending Newsతెలంగాణలో బూస్టర్ డోసు ప్రారంభం

తెలంగాణలో బూస్టర్ డోసు ప్రారంభం

Booster Dose  : అభివృద్ధి చెందిన అన్ని దేశాలు బూస్టర్ డోసు వేసుకుంటున్నాయి. మనం అదే దారిలో నడవాలి. అర్హులైన వారు బూస్టర్ తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పిలుపు ఇచ్చారు. అందరికి ప్రభుత్వం ఉచితంగా టీకాలు పంపిణీ చేస్తుందన్నారు. ఎంఐఎం ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసితో కలిసి హైదరబాద్ చార్మినార్ వద్ద గల ప్రభుత్వ యునాని ఆసుపత్రిలో ఈ రోజు  బూస్టర్ డోస్ ప్రారంభించిన ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా బూస్టర్ డోసు వేసుకున్న ఎమ్మెల్యేలు ముంతాజ్ అహ్మద్ ఖాన్, పాషా ఖాద్రీ.

ఇద్దరు ఎమ్మెల్యేలు వాక్సిన్ తీసుకుని.. బూస్టర్ డోసు ప్రారంబించడం సంతోషంగా ఉందని, అందరూ తప్పక వ్యాక్సిన్ వేసుకోవాలనే సందేశాన్ని ప్రజలందరికీ ఇచ్చారని మంత్రి అభినందించారు. బూస్టర్ డోస్ , 15 ఏళ్ళు పై బడిన వారికి టీకా విషయంలో ప్రజాప్రతినిధులు  సహకరించాలన్నారు. టీకా విషయంలో ఎలాంటి సంశయాలు అక్కర్లేదని, మొదటి డోస్ 102% పూర్తి అయిందని మంత్రి తెలిపారు. కేవలం వారం రోజల్లో 15 నుంచి 18 ఏళ్ళ మధ్య వారిలో 38 % మందికి మొదటి డోస్ టీకా పూర్తి అయిందని, టికా పంపిణీలో తెలంగాణ ముందంజలో ఉందని హరీష్ చెప్పారు.

ముఖ్యమంత్రి ఆదేశాలతో వేగంగా టీకా పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, యునానీ ఆస్పత్రిలో సమస్యలపై చర్చించామని, త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి స్పష్టం చేశారు. పక్షవాతం వంటి వాటికి చికిత్స కోసం ఇతర రాష్ట్రాల నుంచి సైతం యునానీ ఆస్పత్రికి రోగులు వస్తుంటారని, నిధుల అంశాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లి మంజూరు చేస్తామని మంత్రి ప్రకటించారు.

అక్బరుద్దీన్ ఒవైసి

వ్యాక్సిన్ తీసుకోవడం ముఖ్యమని, ఏదో జరుగుతుంది అనే అపోహ వద్దని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. ప్రతి ఒక్కరూ వాక్సిన్ తీసుకోవాలని, కరోనా సమయంలో కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. మాస్క్ ధరించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, భౌతిక దూరం పాటించడం మరువద్దన్నారు. కరోనాపై పోరులో ప్రభుత్వానికి అందరూ సహకరించాలని అక్బరుద్దీన్ ప్రజలకు సూచించారు.

Also Read : యాదాద్రి పునఃప్రారంభ ఏర్పాట్లపై సమాలోచనలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular