Sunday, April 21, 2024
HomeTrending Newsయాదాద్రి పునఃప్రారంభ ఏర్పాట్లపై సమాలోచనలు

యాదాద్రి పునఃప్రారంభ ఏర్పాట్లపై సమాలోచనలు

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునఃప్రారంభ ఏర్పాట్లపై చర్చించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని జీయర్‌ స్వామి ఆశ్రమానికి ఈ రోజు వేంచేశారు.

మార్చి 28న మహా కుంభసంప్రోక్షణం చేపట్టాలని, 21 నుంచి మహా సుదర్శనయాగం నిర్వహించాలని ఇప్పటికే ముహూర్తం ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు, ఆహ్వానాలు, సంబంధిత అంశాలపై జీయర్‌ స్వామితో సీఎం సమావేశమై చర్చించారు.

ఫిబ్రవరిలో జీయర్‌ ఆశ్రమంలో రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ, సంబంధిత ఏర్పాట్లపై కూడా సీఎం చర్చించారు. ఈ సందర్భంగా ఆశ్రమ రుత్వికులు సీఎం కేసీఆర్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

ఆశ్రమంలోని యాగశాలకు వెళ్లిన ముఖ్యమంత్రికి …అక్కడ ఏర్పాట్లపై చినజీయర్‌ స్వామి వివరించారు. సీఎంతో పాటు మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌, మైం హోం అధినేత రామేశ్వరరావు ఉన్నారు.

Discussions On Yadadri

RELATED ARTICLES

Most Popular

న్యూస్