Jeeyar Swamy with CM Jagan:
త్రిదండి రామానుజ చినజీయర్‌ స్వామి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.  రామానుజాచార్యులు అవతరించి వెయ్యేళ్లు అవుతున్న సందర్భంగా హైదరాబాద్‌ శివార్లలోని ముచ్చింతల్‌ ఆశ్రమంలో తలపెట్టిన సహస్రాబ్ది మహోత్సవాలకు రావాలని జగన్‌ను ఆహ్వనించారు చినజీయర్‌ స్వామి. ఈ సందర్భంగా  సిఎం జగన్‌ చినజీయర్‌ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు.

వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 14 వ తేదీ వరకు సహస్రాబ్ది ఉత్సవాల నిర్వహణ, ఇందులో భాగంగా 1035 కుండ శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువు, 108 దివ్యదేశ ప్రతిష్ఠ, కుంభాభిషేకము, స్వర్ణమయ శ్రీరామానుజ ప్రతిష్ఠ కార్యక్రమాలు జరగనున్నాయి.

చినజీయర్‌ స్వామితో పాటు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, మై హోం గ్రూప్‌ చైర్మన్‌ జూపల్లి రామేశ్వరరావు ముఖ్యమంత్రిని కలుసుకున్నారు.

Also Read : విద్యుత్ చట్టాలను ఉపసంహరించుకోవాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *