Monday, June 15, 2026
Homeసినిమాసంక్రాంతి బరిలో ‘బంగార్రాజు’

సంక్రాంతి బరిలో ‘బంగార్రాజు’

Bangarraju on January 14th : టాలీవుడ్ కింగ్ నాగార్జున‌, యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య‌ల క్రేజీ కాంబినేష‌న్లో రూపొందుతోన్న ‘బంగార్రాజు’ సంక్రాంతి బరిలో నిలుస్తోంది. జనవరి 14న సినిమా విడుదల కానుంది, ఈ విషయాన్ని నాగార్జున స్వయంగా వెల్లడించారు.  నేడు బంగార్రాజు రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ వేడుక నిర్వహించారు. నాగ్ మాట్లాడుతూ ఓమిక్రాన్ పరిస్థితుల వల్ల ఎలాంటి ఇబ్బందీ లేకపోతే ­14న తప్పకుండా విడుదల చేస్తామని చెప్పారు.

సోగ్గాడే చిన్ని నాయ‌నా’కు సీక్వెల్ గా రూపొందుతోన్న ఈ సినిమాకు డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో నాగార్జున స‌ర‌స‌న ర‌మ్య‌కృష్ణ న‌టిస్తుంటే.. నాగ‌చైత‌న్య స‌ర‌స‌న ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి న‌టిస్తుంది. అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ పై నాగార్జున ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బంగార్రాజు సినిమా పై అటు అభిమానుల్లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ సినిమా విడుదల తేదీలు వాయిదా పడడం బాధాకరమని, వారు ఎంత కష్టపడ్డారో తనకు వ్యక్తిగతంగా తెలుసనీ, అయితే అవి పాన్ ఇండియా సినిమాలు కాబట్టి మార్కెట్ పరిధి ఎక్కువ అని, ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాల్సి ఉంటుందని అందుటే  తప్పనిసరి పరిస్థితుల్లో వాయిదా వేసి ఉంటారని అభిప్రాయపడ్డారు. ఆ సినిమాలు రెండు మూడేళ్ళ నుంచి ఈ సినిమాలు నిర్మాణంలో ఉన్నాయని, అవి పూర్తి స్థాయిలో ఆడితేనే వారి కష్టానికి ప్రతిఫలం వస్తుందని నాగార్జున వివరించారు. న్యూయ‌ర్ సంద‌ర్భంగా విడుదల చేసిన ‘బంగార్రాజు’ టీజ‌ర్ ప్రేక్షకులను అలరిస్తోంది.

ఈ వేదిక నుంచి రాజకీయాలపై మాట్లాడకూడదని, మాట్లాడబోనని నాగార్జున స్పష్టం చేశారు. ఏపీలో టికెట్ రేట్ల తగ్గింపు ప్రభావం తమ సినిమాపై ఎంత మాత్రం ఉండబోదని తేల్చి చెప్పారు. టికెట్ రేట్లు ఎక్కువ ఉంటే ఎక్కువ ఆదాయం వస్తుందన్నారు.

Also Read : ప్రేక్షకులను అలరిస్తున్న బంగార్రాజు టీజ‌ర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular