Tuesday, April 16, 2024
HomeTrending Newsబండి సంజయ్ విడుదల

బండి సంజయ్ విడుదల

కొద్దిసేపటి క్రితం (బుధవారం సాయంత్రం) కరీంనగర్ జైలు నుండి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విడుదల అయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన సంజయ్ పోలీసులు, ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు జైళ్లు కొత్తకాదు 9 సార్లు జైలు కి వెళ్ళానని, నేను ఉపాధ్యాయులు ఉద్యోగుల కోసం జైలుకి పోయినా అని తెలిపారు. 317 జీవోను  సవరించాలని మళ్లా డిమాండ్ చేస్తున్న సంజయ్ నీ సంగతెంటో తెలుస్తా అని సిఎం కెసిఆర్ కు సవాల్ విసిరారు. ఉపాధ్యాయులు అందరితో చర్చించు వాళ్ళకి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మహిళలపై దాడి చేశారని, బిజెపి కార్యాలయంలో గుండాగిరి చేసి హేయమైన చర్యకు పూనుకున్నారని మండిపడ్డారు.

ఉపాధ్యాయులు కు అండగా బిజెపి ఉంటుందన్న బండి సంజయ్ ఎవరు బయపడవద్దని కార్యకర్తలకు సూచించారు. అయితే నేను జైలుకి పోయింది వేరు తొందరలో నువ్వు(కెసిఆర్) పోయేది వేరు అన్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, రైతులు కోసం నిరుద్యోగుల కోసం మళ్ళా జైలుకు వెళ్తానని తెగేసి చెప్పారు. ప్రభుత్వం, పోలీసుల తీరును హైకోర్టు చికొట్టిందని, తాము ధర్మము కోసం పనిచేసే వ్యక్తులమన్నారు. బలి దానాలకు సిద్ధమైన పార్టీ మాది మీలాంటి తుప్పేలు పార్టీ కాదని, గ్యాస్ కట్టర్లతో ఆఫీస్ ను బద్దలు కొడతావా మహిళలు ఉన్నా ఇంత దుర్మార్గం గా వ్యవహరిస్తావా అని సిఎం పాలన తీరును తప్పుపట్టారు. ప్రశ్నిస్తే జైలుకు పంపుతావా.. జైల్లో ఉన్న వారి కుటుంబాలు వాళ్ళు ఆశీర్వదిస్తున్నారని, అవినీతి కుబేరుడు కెసిఆర్ అని ఆరోపించారు.

హైకోర్టు నిన్ను తప్పు బట్టిందని, విడుదల చేయమన్నా విడుదలను అడ్డుకోవడానికి ప్రయత్నం చేసావని విమర్శించారు. కేసీఆర్ నీకు కృతజ్ఞతలు నువ్వు ఎంత క్రూరుడువో ప్రజలకు తెలిసిందన్న బండి దమ్ముంటే ఉద్యోగులతో బయటకు వచ్చి మాట్లాడు అని డిమాండ్ చేశారు. కెసిఆర్ నీచపు చరిత్రకు చరమగీతం పాడతామని బండి సంజయ్ అన్నారు.

తాజాగా తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 10న రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపు  ఇచ్చిన బిజెపి కొద్దిసేపటి క్రితం ఉపసంహరించుకుంది. ఈ మేరకు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమెంధర్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. అక్రమ అరెస్ట్‌లకు నిరసనగా బీజేపీ బంద్‌కు పిలుపునిచ్చింది. 317 జీవోను సమీక్షించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.

Also Read : బండి సంజయ్ కు హైకోర్టులో ఊరట

RELATED ARTICLES

Most Popular

న్యూస్