Thursday, March 19, 2026
Homeసినిమాప్రభాస్ జోడీగా 'ఉప్పెన' పిల్ల!

ప్రభాస్ జోడీగా ‘ఉప్పెన’ పిల్ల!

Prabhas-Krithi: ప్రభాస్ తాజా చిత్రంగా ఈ నెల 11వ తేదీన థియేటర్లకు వచ్చిన ‘రాధేశ్యామ్‘ సందడి చేస్తోంది. ఈ సినిమా తరువాత ఆయన ‘సలార్’పై దృష్టిపెట్టనున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు  రానుందని అంటున్నారు. ఇక ఆ తరువాత సినిమాగా ఆయన ‘ప్రాజెక్టు K’ను కూడా పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే.  నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను పూర్తిచేసుకుంది. తదుపరి షెడ్యూల్ కి రెడీ అవుతోంది.

ఆల్రెడీ ‘ఆది పురుష్’ షూటింగును కూడా అవగొట్టేసిన ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ చేయవచ్చని అంతా అనుకున్నారు. కానీ అంతకంటే ముందుగా ఆయన మారుతి దర్శకత్వంలో ‘రాజా డీలక్స్’ చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఇది మాస్ మసాలా ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్నట్టు చెబుతున్నారు. ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ కి తగిన యాక్షన్ కి తన మార్క్ ఎంటర్టైన్మెంట్ ను మారుతి జోడించనున్నాడని అంటున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ ముగ్గురు కథానాయికలతో రొమాన్స్ చేస్తాడనేది తాజా సమాచారం.

ఒక కథానాయికగా మాళవిక మోహనన్ ను తీసుకున్నారట. ఇంతవరకూ తమిళ .. మలయాళ సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చిన మాళవిక, ఈ సినిమాతో తెలుగు తెరకి పరిచయం కానుందని అంటున్నారు. మరో కథానాయికగా ‘ఉప్పెన’ పిల్ల కృతి శెట్టిని ఎంపిక చేసినట్టుగా చెబుతున్నారు. ఇప్పటికే హ్యాట్రిక్ హిట్ కొట్టిన ఈ బ్యూటీ, ఈ ఏడాదిలో మరో మూడు సినిమాలను ప్రేక్షకులు ముందుకు తీసుకురానుంది. ఇంత త్వరగా డాళింగ్ జోడీగా ఛాన్స్ దొరుకుతుందని ఆమె కూడా ఊహించి ఉండదు. ఇక బాల – సూర్య కాంబినేషనలో సెట్స్ పైకి వెళ్లే ఒక తమిళ సినిమాతో ఆ అమ్మాయి కోలీవుడ్ ఎంట్రీ కూడా జరగనుందని చెప్పుకుంటున్నారు. మొత్తానికి కృతి కెరియర్ గ్రాఫ్ తారాజువ్వను తలపిస్తోంది కదూ!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular