Wednesday, March 18, 2026
HomeTrending Newsకర్నూలు జిల్లాలో కేఆర్ఎంబీ బృందం టూర్

కర్నూలు జిల్లాలో కేఆర్ఎంబీ బృందం టూర్

కర్నూలు జిల్లాలో సోమ, మంగళ వారాల్లో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు బృందం పర్యటించనుంది.  జిల్లాలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తోన్న నీటిపారుదల  ప్రాజెక్టులను 10 మంది సభ్యుల బృందం పరిశీలించనుంది.  కృష్ణానదీ ప్రాజెక్టుల స్వాధీనానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ పై ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన నేపధ్యంలో జిల్లాలో కేఆర్ఎంబీ టీమ్ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.

సోమవారం మల్యాల, ముచ్చుమర్రి, హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకాలు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యు లేటర్ ను….ఎల్లుండి  మంగళవారం శ్రీశైలం ప్రాజెక్టు, విద్యుత్ కేంద్రాలను పరిశీలించనున్న కేఆర్ఎంబీ బృందం పరిశీలిస్తుంది.

శ్రీశైలంలో కేఆర్ ఎం బి బృందం సమీక్షా సమావేశం నిర్వహించనుంది. ఈ బృందంలో మేనేజ్మెంట్ బోర్డు అధికారులతో పాటు  ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన జెన్ కో ఉన్నతాధికారులు కూడా ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular