Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్కృనాల్ కు కోవిడ్  : టి-20 వాయిదా

కృనాల్ కు కోవిడ్  : టి-20 వాయిదా

శ్రీలంకలో పర్యటిస్తున్న భారత క్రికెట్ జట్టులో కరోనా కలకలం రేపింది. ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా కు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీనితో మంగళవారం  జరగాల్సిన రెండో టి-20 మ్యాచ్ ను రేపటికి వాయిదా వేశారు.  ఈ విషయాన్ని బిసిసిఐ అధికారికంగా ధృవీకరించింది. కృనాల్ కు పాజిటివ్ గా తేలడంతో జట్టులోని మిగిలిన ఆటగాళ్ళతో పాటు కోచ్, సహాయక సిబ్బంది అందరికీ ఆర్టీ పీసీఆర్ టెస్టులు నిర్వహిస్తున్నామని బిసిసిఐ వెల్లడించింది. మరోవైపు శ్రీలంక జట్టు సభ్యులకు కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ప్రస్తుతం ఇరు జట్ల ఆటగాళ్లను ఐసోలేషన్ లో ఉంచారు. మిగిలిన ఆటగాళ్ల రిపోర్టులు వచ్చిన తరువాత తదుపరి మ్యాచ్ నిర్వహణపై నిర్ణయం తీసుకుంటారు. అందరికీ నెగెటివ్ వస్తే నేటి మ్యాచ్ రేపు జరుపుతారు. మరికొందరు ఆటగాళ్ళకు పాజిటివ్ వస్తే మాత్రం తదుపరి మ్యాచ్ ల నిర్వహణ సందిగ్ధం లో పడే అవకాశాలున్నాయి.

ఆదివారం జరిగిన మొదటి టి-20 మ్యాచ్ లో ఇండియా 38 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్