Tuesday, June 9, 2026
HomeTrending Newsమా భూములు మాకివ్వండి: కేటిఆర్ లేఖ

మా భూములు మాకివ్వండి: కేటిఆర్ లేఖ

Give Back: తెలంగాణాలో పలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేందుకు  కేంద్ర ప్రభుత్వం  యత్నిస్తోందని, ఆయా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 7200 ఎకరాల భూమిని వెనక్కు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని రాష్ట్ర పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటిఆర్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఓ లేఖ రాశారు. ఆ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయిస్తే  తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే విధంగా వాటిని సద్వినియోగం చేసుకుంటామని లేఖలో పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా కోసం చేపట్టే స్కైవే వంటి ప్రజోపయోగ ప్రాజెక్టులకు భూములు అడిగితే మార్కెట్ ధరల ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రం ఇచ్చిన భూములను అమ్మే హక్కు ఎక్కడుందని లేఖలో ప్రశ్నించారు.

కేటిఆర్ లేఖలో ముఖ్యాంశాలు:

  • తెలంగాణలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ధలను అమ్మేందుకు కేంద్రం ప్రయత్నం
  • 40 వేల కోట్ల రూపాయల తెలంగాణ ఆస్తులను మోడీ ప్రభుత్వం అమ్ముతోంది.
  • హిందుస్తాన్ కేబుల్స్ లిమిటెట్, హిందుస్థాన్ ఫ్లోరో కార్బన్స్ లిమిటెడ్, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, HMT, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(CCI), ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను మోడీ ప్రభుత్వం తన డిజిన్వెస్ట్మెంట్ ప్రణాళికల్లో భాగంగా అమ్మకానికి సిద్ధంగా ఉంది
  • ఈ 6 సంస్ధలకు గతంలో సూమారు 7200 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది
  • ప్రభుత్వ ధరల ప్రకారం ఈ భూమి విలువ  కనీసం 5 వేల కోట్ల రూపాయాలు ఉంటుంది
  • బహిరంగ మార్కెట్ ధరల ప్రకారం 40వేల కోట్లదాకా ఉంటుంది.
  • ఆయా ప్రభుత్వ రంగ సంస్థలకు రాష్ట్రం కేటాయించిన భూముల్లో కొత్త పరిశ్రమలు, సంస్థలను ప్రారంభించాలి
  • లేదంటే ఆయా భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలి
  • తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే విధంగా ఆయా భూముల సద్వినియోగం
  •  ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular