Sunday, January 19, 2025
HomeTrending Newsకేంద్రం వల్లే వ్యాక్సిన్ కొరత : కేటియార్

కేంద్రం వల్లే వ్యాక్సిన్ కొరత : కేటియార్

కేంద్ర ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్లే దేశంలో వ్యాక్సిన్ కొరత ఏర్పడిందని రాష్ట్ర మునిసిపల్ శాఖా మంత్రి కేటియార్ మరోసారి విమర్శించారు. వ్యాక్సిన్ కొనుగోలు చేయాల్సిన సమయంలో ఆ పని చేయలేదని, ఇతర దేశాలకు ఎగుమతి చేశారని పేర్కొన్నారు. దేశంలో 132 కోట్ల మందికి రెండు డోసులు వేయాలంటే 264 కోట్ల డోసులు కావాల్సి ఉంటుందని… దీనిలో పావలా భాగం డోసులు కూడా అందుబాటులో లేవని తెలిసి కూడా 18 ఏళ్ళు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ అని ప్రకటించి చేతులు దులుపుకున్నారని ఎద్దేవా చేశారు.

మంత్రి కేటియార్ నేడు గచ్చిబౌలి లోని టిమ్స్ ఆస్పత్రిని సందర్శించారు. హైసియా, మైక్రోసాఫ్ట్, క్వాల్కం, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, కాగ్నిజెంట్ మరియు వెల్స్ ఫార్గో ఆధ్వ‌ర్యంలో ఐసియు విభాగంలో ఏర్పాటు చేసిన 150 పడకల కేంద్రాన్ని ప్రారంభించారు. చికిత్స పొందుతున్న కరోనా రోగులను పరామర్శించి, వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆస్పత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు

కొన్ని రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లు పిలిచినా స్పందన లేదని కేటియార్ ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని రాష్ట్రాలు ఫైజర్, మోడర్నా లాంటి కంపెనీలతో నేరుగా సంప్రదిస్తే తాము కేంద్ర ప్రభుత్వంతోనే మాట్లాడతామని వారు చెబుతున్నారని వెల్లడించారు. కొన్ని దేశాల్లో 50 కోట్ల డోసుల వరకూ నిరుపయోగంగా పడి ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం ఇకనైనా మేల్కొని, ఇతర దేశాల్లో ఎక్కడ వ్యాక్సిన్ అందుబాటులో ఉందో చూసి అవసరమైతే ఆయా ప్రధాన మంత్రులతో, రాష్ట్రపతులతో మాట్లాడి తెప్పించాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్