Friday, November 22, 2024
Homeతెలంగాణవ్యాక్సినేషన్ ప్రక్రియ లోప భూఇష్టం : కేటియార్

వ్యాక్సినేషన్ ప్రక్రియ లోప భూఇష్టం : కేటియార్

కేంద్ర ప్రభుత్వ వ్యాక్సిన్ విధానం లోప భూ ఇష్టంగా ఉందని రాష్ట్ర మున్సిపల్, ఐటి శాఖల మంత్రి కేటియార్ వ్యాఖానించారు. ఆస్క్ కేటియార్ కార్యక్రమంలో భాగంగా ట్విట్టర్ ద్వారా ప్రజలతో వాక్సినేషన్ ప్రక్రియపై మాట్లాడారు.
భారతదేశ జనాభా పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ అందించాలంటే 272 కోట్ల వాక్సిన్ డోసులు అవసరం అవుతాయని దీనికి సంబంధించి 150 రూపాయలకు ఒక వ్యాక్సిన్ డోసు చొప్పున కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందని కేటియార్ అన్నారు. కేంద్రం బడ్జెట్లో ప్రకటించిన 35 వేల కోట్ల రూపాయలను వ్యాక్సిన్ కోసం ఉపయోగించాలని, కానీ ఈ నిధులు ఎక్కడికి పోయాయో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.

దేశీయంగా వ్యాక్సిన్ సరఫరా తగినంత లేకపోవడం వలన కేంద్ర ప్రభుత్వం అమెరికా కెనడా డెన్మార్క్ నార్వే వంటి దేశాల్లో నిరుపయోగంగా ఉన్న 50 కోట్ల వ్యాక్సిన్లకు సంబంధించి ఆయా దేశాలతో వెంటనే చర్చను ప్రారంభించి వాటిని భారతదేశానికి తరలించే ప్రక్రియను ప్రారంభించాలని కేటీఆర్ మరోసారి స్పష్టం చేశారు.

దేశంలో వ్యాక్సిన్లు అత్యధికంగా ఉత్పత్తి అవుతున్నప్పటికీ కూడా ప్రజలకు ఎందుకు అందుబాటులో లేవన్న విషయానికి సంబంధించి మంత్రి కేటీఆర్ పలు ఆసక్తికరమైన అంశాలను ప్రస్తావించారు. ఇతర దేశాలు గత సంవత్సరమే మేల్కొని పెద్దఎత్తున ఆయా కంపెనీలకు వ్యాక్సిన్లు సరఫరా కోసం ఆర్డర్ ఇచ్చాయని, అయితే కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం జనవరిలో మేల్కొన్న దన్నారు. దీంతో పాటు ఇతర దేశాలు తమ ప్రజలకి పెద్దఎత్తున వ్యాక్సిన్ సరఫరాను అందించే ప్రయత్నం చేస్తుంటే భారత సర్కారు మాత్రం వ్యాక్సిన్ మైత్రి మరియు విదేశాలకు వాక్సిన్ ఎగుమతుల ప్రమోషన్ లకు సంబంధించిన అంశాలపై దృష్టి కేంద్రీకరించి ఉందన్నారు.

అమెరికా కెనడా వంటి దేశాలు తమ దేశ జనాభాకు అవసరమైన వాటి కన్నా ఎక్కువగానే వ్యాక్సిన్లను ప్రొక్యూర్ చేసుకున్నాయని, ముఖ్యంగా కెనడా లాంటి దేశం ఒక వ్యక్తికి తొమ్మిది డోసు ల చొప్పున వ్యాక్సిన్లకు ఆర్డర్ ఇచ్చిన విషయాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు.

ఒకవేళ థర్డ్ వేవ్ కరోనా వస్తే పిల్లల పైన అత్యధిక ప్రభావం చూపుతుందన్న భయాందోళన నేపథ్యంలో వారికి వ్యాక్సిన్ ఏమైనా అందుబాటులోకి వస్తుందా అన్న ప్రశ్నకు సమాధానంగా వ్యాక్సిన్ కి సంబంధించిన ట్రయల్స్ ఇండియాలోనూ, విదేశాల్లో కూడా ప్రారంభమయ్యాయని, త్వరలోనే పిల్లలకు కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్