Thursday, April 25, 2024
Homeసినిమాఎన్టీఆర్ - కొరటాల మూవీ 'సెన్సేషనల్'?

ఎన్టీఆర్ – కొరటాల మూవీ ‘సెన్సేషనల్’?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సినిమా చేయాలనుకున్నారు. అయితే.. కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్ట్ ఆగింది. ఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాల శివతో సినిమా చేయనున్నారు. గతంలో వీరిద్దరూ కలిసి జనతా గ్యారేజ్ మూవీ చేశారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఈసారి చేయనున్న సినిమా ఆరంభం కాకుండానే అంచనాలు అధికంగా ఉన్నాయి.

ఇదిలా ఉంటే.. ఈ క్రేజీ మూవీకి సెన్సేషనల్ అనే పవర్‌ఫుల్ టైటిల్ పరిశీలిస్తున్నట్టు, తాజాగా వార్తలు వస్తున్నాయి. ఈ టైటిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌ పై మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించే ఈ పాన్ ఇండియా మూవీని ఆర్ఆర్ఆర్ పూరైన తర్వాత ఆరంభించనున్నారు. స్టూడెంట్ పాలిటిక్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాని తెరకెక్కించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రేజీ మూవీని 2022 సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్