వ్యాక్సిన్ పై కేంద్ర ప్రభుత్వానికి ముందు చూపు లేదని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటియార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ ఉత్పత్తిని 85 శాతం తన వద్దే ఉంచుకుందని, ఈ నిబంధనతో రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. 15 శాతం వ్యాక్సిన్ మాత్రమే రాష్ట్రాలకు ఇచ్చారని విమర్శించారు.
వ్యాక్సిన్ తయారు చేస్తున్న కంపెనీలు కూడా కేంద్ర, రాష్ట్రాలకు వేర్వేరు ధరలు నిర్ణయించాయని గుర్తు చేశారు. రాష్ట్రాలకు అవసరమైనంత వ్యాక్సిన్ సరఫరా కావడం లేదని తెలిపారు. మన దేశానికి ఎంత మేరకు వ్యాక్సిన్ అవసరమో ఆలోచించకుండానే విదేశాలకు ఇచ్చారని కేటీఆర్ విమర్శలు గుప్పించారు.