ప్రజల కోసం పోరాడిన కుటుంబ చరిత్ర మాది.. అందుకు భారతీయుడిగా, తెలంగాణవాసిగా గర్వంగా ఫీలవుతున్నాను అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మా కుటుంబం నుంచి అందరికీ ఆదర్శవంతమైన వ్యక్తిని మీకు ఇవాళ పరిచయం చేస్తున్నానని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. మా అమ్మ వాళ్ల తండ్రి జే కేశవరావు.. గాంధీజీని స్ఫూర్తిగా తీసుకొని.. 1940 చివరలో తెలంగాణ పోరాటానికి మద్దతుగా, నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశారని కేటీఆర్ గుర్తు చేశారు. కేశవరావు స్వాతంత్ర్య సమరయోధుడిగా భారత ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందారని మంత్రి తెలిపారు.
ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న నాయకులు ఎంత మంది స్వాతంత్ర్య ఉద్యమంలో పాలుపంచుకున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. వారికి సంబంధం లేని విషయాలను కూడా తమదని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారని కేటీఆర్ విమర్శించారు.