Friday, March 20, 2026
Homeస్పోర్ట్స్మూడో వన్డేకు కు కుల్దీప్ యాదవ్

మూడో వన్డేకు కు కుల్దీప్ యాదవ్

స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను బంగ్లాదేశ్ తో జరగనున్న మూడో వన్డేకు ఎంపిక చేస్తూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) నిర్ణయం తీసుకుంది. చేతి వేలి గాయం కారణంగా కెప్టెన్ రోహిత్ శర్మ మూడో వన్డేకు దూరమైన సంగతి తెలిసిందే. ముంబై చేరుకున్న రోహిత్ కు వైద్యులు వివిధ రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. నివేదికల ఆధారంగా రోహిత్ తదుపరి బంగ్లా టూర్ పై నిర్ణయం తీసుకుంటామని బిసిసిఐ కార్యదర్శి జై షా వెల్లడించాడు,

మరో వైపు గాయాల కారణంగా రెండో వన్డేకు దూరమైన రాహుల్ చాహర్, కుల్దీప్ సేన్ లు కూడా బంగ్లా సిరీస్ కు పూర్తిగా దూరమయ్యారు. వారిద్దరినీ బెంగుళూరు నేషనల్ క్రికెట్ అకాడమీ లో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.

గాయాల కారణంగా ముగ్గురు ఆటగాళ్ళు వన్డే సిరీస్ కు దూరమయ్యారు.

బంగ్లాదేశ్ తో రెండు టెస్టుల సిరీస్ కొడం బిసిసిఐ ప్రకటించిన టెస్ట్ జట్టులో కుల్దీప్ కు స్థానం లభించిన సంగతి తెలిసిందే. అయితే మూడో వన్డేలో ఫైనల్ లెవెన్ లో కుల్దీప్ ఉంటాడా లేదా అనేది వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular