Sunday, June 14, 2026
HomeTrending Newsశాసనసభ్యునిగా కూసుకుంట్ల ప్రమాణ స్వీకారం

శాసనసభ్యునిగా కూసుకుంట్ల ప్రమాణ స్వీకారం

శాసనసభ ఉప ఎన్నికల్లో మునుగోడు శాసనసభ నియోజకవర్గం నుండి నూతనంగా ఎన్నికైన సభ్యుడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేత శాసనసభలో సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేయించిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి. శాసనసభ సభాపతి చాంబర్‌లో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మున్సిపల్ & ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఆర్ధిక & వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి హరీష్ రావు, హోంమంత్రి మహమూద్ అలీ, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, MP లు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, కార్పోరేషన్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు మరియు లెజిస్లేచర్ సెక్రటరీ డా. వి నరసింహా చార్యులు.

అసెంబ్లీ రూల్స్ బుక్స్, ఐడెంటిటీ కార్డును ఈ సందర్భంగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి స్పీకర్ అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular