Tuesday, June 16, 2026
HomeTrending Newskusuma jagadish: కుసుమ జగదీష్ మృతి పట్ల కెసిఆర్ సంతాపం

kusuma jagadish: కుసుమ జగదీష్ మృతి పట్ల కెసిఆర్ సంతాపం

ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ములుగు జిల్లా పరిషత్ చైర్మన్, కుసుమ జగదీష్ అకాల మరణం పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపాన్ని వ్యక్తం చేశారు. వారి మృతి పట్ల సీఎం ఆవేదన చెందారు. శోక తప్పులైన వారి కుటుంబ సభ్యులకు ఆత్మస్థైర్యాన్ని కల్పించాలని భగవంతున్ని ప్రార్థించారు.

తెలంగాణ ఉద్యమకారుడిగా నాటి ఉద్యమంలో జగదీష్ పోషించిన చురుకైన పాత్రను, ములుగు జిల్లా పార్టీ అధ్యక్షుడుగా జిల్లా పరిషత్ చైర్మన్ గా జగదీష్ చేస్తున్న సేవలను సిఎం స్మరించుకున్నారు. వారి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular