Thursday, April 25, 2024
Homeసినిమాఅందుకే 'స్వాతిముత్యం' ఆదరణ పొందలేకపోయిందా? 

అందుకే ‘స్వాతిముత్యం’ ఆదరణ పొందలేకపోయిందా? 

ఒక సినిమా ఆదరణ పొందలేకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. కథాకథనాలు బాగోలేకపోవడం వలన పరాజయంపాలు కావడం సహజంగా జరుగుతూ ఉంటుంది. కానీ కంటెంట్ బాగానే ఉన్నప్పటికీ సరైన సమయంలో విడుదల చేయకపోవడం .. సినిమాలో ఉన్న కంటెంట్ ను ఇంట్రస్టింగ్ గా జనాల ముందుకు తీసుకుని వెళ్లకపోవడం కూడా ఆ సినిమా వసూళ్లపై ప్రభావం చూపుతుంటాయి. ‘స్వాతిముత్యం’ సినిమా విషయంలో అది ఆడియన్స్ కి కనెక్ట్ కాకపోవడానికి రెండో కారణాన్ని చెప్పుకోవచ్చు.

స్వాతిముత్యం‘ సినిమా చాలా తక్కువ బడ్జెట్ లోనే తీశారు. విలేజ్ నేపథ్యంలో రెండు కుటుంబాల మధ్య నడిచే కథ ఇది. బడ్జెట్ పరంగా చూసుకున్నా .. తారాగణం పరంగా చూసుకున్నా ఇది చిన్న సినిమాగా అనిపించినప్పటికీ, ఇంట్రెస్టింగ్ పాయింట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ పాయింట్ లేకపోతే సితార వంటి బ్యానర్లో ఈ సినిమా వచ్చి ఉండేది కాదేమో. పైగా దర్శకుడు లక్ష్మణ్ కె కృష్ణ తాను చెప్పదలచుకున్న విషయాన్ని చాలా నీట్ గా చెప్పాడు. లవ్ .. కామెడీ పాళ్లను కలుపుతూ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను అందించాడు.

సినిమాలో సందర్భాను సారంగా వచ్చే పాటలు కూడా బాగానే అనిపిస్తాయి. మహతి స్వరసాగర్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణే అని చెప్పాలి. బెల్లంకొండ గణేశ్ కి ఇది మొదటి సినిమానే అయినప్పటికీ, పాత్రకి తగినట్టుగా చేశాడు. కథపై ఎంతో నమ్మకం ఉంటే తప్ప సితార వారు ఈ సినిమాను ‘గాడ్ ఫాదర్’ .. ‘ది ఘోస్ట్’ మధ్యలోకి తీసుకుని రారు. ఆ రెండు శింజిమాల జోనర్లు వేరు కనుక, ‘స్వాతిముత్యం’ సినిమాను దసరా సెలవుల్లో తీసుకుని రావడం సరైన నిర్ణయమే.

అయితే ఈ సినిమా విడుదలకి ముందు పబ్లిసిటీ పరంగా .. ప్రమోషన్స్ పరంగా కంటెంట్ పై ఆసక్తిని రేకెత్తించడంలో విఫలమయ్యారు. ఎందుకు ఈ సినిమాను చూడాలి? సినిమాలో ఏవుంది? అనే విషయాన్ని జనాలకి చేరవేయలేకపోయారు. రిలీజ్ తరువాత  కూడా కామెడీ మీదనే ఫోకస్ చేస్తూ ప్రమోషన్స్ చేశారు.; కానీ అసలు పాయింట్ వేరు. దానిని పరోక్షంగా .. జనాలకి ఎక్కేలా చెప్పగలిగి ఉంటే బాగుందేమో. ఓటీటీలో మాత్రం ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్