Sunday, January 19, 2025
Homeసినిమాపావురం లాంటి అమ్మాయ్ ఎగురుతూ వచ్చేసింది!

పావురం లాంటి అమ్మాయ్ ఎగురుతూ వచ్చేసింది!

Lailaa is back: 90వ దశకంలో తెలుగు తెరపైకి దూసుకొచ్చిన అందమైన కథానాయికలలో ‘లైల‘ ఒకరు. ‘ఎగిరే పావురమా’ సినిమాతో ఈ బ్యూటీని ఎస్వీ కృష్ణా రెడ్డి పరిచయం చేశారు. అవసరమైనప్పుడు యాక్ట్ చేస్తూ .. ఆ తరువాత అంతా కళ్లు మూసుకుని నవ్వుతూ ఈ సుందరి కుర్రాళ్ల మనసులను కొల్లగొట్టేసింది. పాలరాతి శిల్పం వంటి ఈ పడుచు పిల్లకి అంతా కూడా అభిమానులైపోయారు .. ఆరాధకులైపోయారు.ఈ సినిమాతో పాటు ఆ తరువాత చేసిన ‘పెళ్లి చేసుకుందాం’ కూడా ఆమెకి భారీ విజయాన్ని అందించింది.

దాంతో తెలుగు తెరపై తిరుగులేకుండా ఈ అమ్మాయి తన హవాను కొనసాగించడం ఖాయమని అనుకున్నారు. ఇక హీరోయిన్ గా మాత్రమే చేస్తానంటూ కూర్చోకుండా, చాలా తక్కువ సమయంలో ‘నువ్వే కావలి’ సినిమాలో ఒక స్టేజ్ సాంగ్  లో మెరిసింది. కారణం తెలియదుగానీ  ఆ తరువాత ఆమె ఎక్కువగా తమిళ సినిమాలు చేసుకుంటూ వెళ్లింది. అడపా దడపా కన్నడ .. మలయాళ  సినిమాల్లోను సందడి చేసింది. 2004లో వచ్చిన ‘శైలజా కృష్ణమూర్తి’ తరువాత తిరిగి ఆమె    తెలుగు తెరపై కనిపించలేదు.

వివాహమైన తరువాత లైలా ఏ భాషలోను సినిమాలు చేయలేదు. పూర్తిగా నటనకు దూరంగా ఉంటూ వచ్చింది. అసలు లైలా ఏం చేస్తోంది? ఏమైపోయింది? అనేది కూడా తెలియకుండా పోయింది. మళ్లీ ఇంతకాలానికి .. ఇప్పుడు ఆమె పేరు వినిపిస్తోంది. కార్తి హీరోగా చేస్తున్న ‘సర్దార్‘ సినిమాతో ఆమె రీ ఎంట్రీ ఇస్తోంది. మిత్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా కథానాయికగా నటిస్తోంది. ఓ ముఖ్యమైన పాత్ర కోసం లైలాను తీసుకున్నారు. లైలాను మళ్లీ తెరపై చూడాలనుకుంటున్న అభిమానులకు ఇది ఆనందాన్ని కలిగించే  విషయమే. ఇక ఆమె తెలుగులోను చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read : అంచనాలు పెంచుతున్న అభినవ్ సర్దార్ లుక్

RELATED ARTICLES

Most Popular

న్యూస్