సింగపూర్ ఓపెన్ లో రెండోరోజు భారత ఆటగాళ్ళు సత్తా చాటారు. లక్ష్య సేన్, కిడాంబి శ్రీకాంత్ తమ ప్రత్యర్థులపై విజయం సాధించగా, ప్రియాన్షు రాజావత్ ప్రత్యర్థి వాకోవర్ కావడంతో తర్వాతి రౌండ్ లోకి అడుగు పెట్టాడు. మహిళల సింగిల్స్ లో ఆకర్షి కాశ్యప్ ఓటమి పాలైంది.
పురుషుల సింగిల్స్ లో లక్ష్య సేన్ 21-17;21-13తో మలేషియా ఆటగాడు లీ జీ జియాపై; కిడాంబి శ్రీకాంత్ 21-13; 21-19తో చైనా ప్లేయర్ లు గుయాంగ్ జు పై గెలుపొందారు.
థాయ్ లాండ్ ఆటగాడు కున్లావాట్ వాకోవర్ గా వెనుదిరగడంతో ప్రియాన్షు రాజావత్ రెండో రౌండ్ లోకి ప్రవేశించాడు.
కాగా, మహిళల సింగిల్స్ లో కొరియా క్రీడాకారిణి అన్ సే యంగ్ 21-10; 21-4 తేడాతో ఆకర్షి కాశ్యప్ పై గెలుపొందింది.