Tuesday, March 10, 2026
Homeస్పోర్ట్స్US Open-2023: సింధు ఓటమి, సెమీస్ కు సేన్

US Open-2023: సింధు ఓటమి, సెమీస్ కు సేన్

యోనెక్స్ బ్యాడ్మింటన్ యూఎస్ ఓపెన్-2023లో భారత స్టార్ ప్లేయర్ లక్ష్య సేన్ పురుషుల సింగిల్స్  సెమీ ఫైనల్స్ కు చేరుకున్నాడు. నేడు జరిగిన క్వార్టర్స్ మ్యాచ్ లో లో మన దేశానికే చెందిన  శంకర్ ముత్తుస్వామి సుబ్రమణియన్ పై 21-10; 21-17 తేడాతో విజయం సాధించాడు.

కాగా,  మహిళల సింగిల్స్ లో పివి సింధు ఓటమి పాలైంది. చైనా ప్లేయర్ గావో ఫాంగ్ లీ 22-20; 21-13 తో విజయం సాధించింది. తొలి రౌండ్ లో సింధు గట్టి పోటీ ఇచ్చినా రెండో రౌండ్ లో ప్రత్యర్ధి ధాటికి తలవంచింది.

భారత కాలమానం ప్రకారం రేపు తెల్లవారుజామున జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్ లో చైనా ప్లేయర్ లీ షి ఫెంగ్ తో లక్ష్య సేన్ తలపడనున్నాడు. గత వారం ముగిసిన కెనడా ఓపెన్ గెల్చుకొని మంచి ఫామ్ లో ఉన్న సేన్ యూఎస్ టైటిల్ కూడా సాధించాలని పట్టుదలతో ఉన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular