Wednesday, March 26, 2025
Homeస్పోర్ట్స్ఇంగ్లాండ్ ఓపెన్: లక్ష్య సేన్ రన్నరప్

ఇంగ్లాండ్ ఓపెన్: లక్ష్య సేన్ రన్నరప్

Lakshya Sen lost: అల్ ఇంగ్లాండ్ ఓపెన్ 2022 టోర్నీలో పురుషుల సింగిల్స్ విభాగంలో లక్ష్య సేన్ రన్నరప్ గా నిలిచాడు. గత వారం జరిగిన జపాన్ ఓపెన్ లో కూడా సేన్ ఫైనల్లో ఓటమి పాలై రన్నరప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. నేడు జరిగిన అల్ ఇంగ్లాండ్ ఫైనల్లో వరల్డ్ నంబర్ వన్ ర్యాంకర్, డెన్మార్క్ ఆటగాడు విక్టర్ ఆక్సెల్ సేన్ చేతిలో 21-10; 21-12  తేడాతో ఓటమి పాలయ్యాడు.

జర్మన్ ఓపెన్ సెమి ఫైనల్ మ్యాచ్ లో లక్ష సేన్ 21-13; 12-21; 22-20 తో విక్టర్ ను ఓడించి ఫైనల్ చేరుకున్నాదు. గత వారం ఓటమికి విక్టర్ బదులు తీర్చుకున్నాడు.

ఈ ఏడాది జరిగిన మొట్టమొదటి టోర్నీ సన్ రైజ్ ఇండియా ఓపెన్-2022 లో పురుషుల సింగిల్స్ విజేతగా నిలిచిన సేన్, తర్వాత జరిగిన సయ్యద్ మోడీ టోర్నీ నుంచి వైదొలిగాడు. తీవ్ర అలసట, విరామం లేని ఆట కారణంగా ఈ టోర్నీ ఆడలేనని నిర్వాహకులకు తెలిపాడు. మూడో టోర్నీగా గత వారం ముగిసిన జర్మన్ ఓపెన్ లో కూడా ఫైనల్ కు చేరిన లక్ష్య సేన్21-18; 21-15 తేడాతో కున్లావట్ చేతిలో పరాజయం పాలయ్యాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్