Tuesday, March 10, 2026
Homeస్పోర్ట్స్Japan Open: సెమీస్ లో సేన్; ప్రణయ్, చిరాగ్-సాత్విక్ జోడీ ఓటమి

Japan Open: సెమీస్ లో సేన్; ప్రణయ్, చిరాగ్-సాత్విక్ జోడీ ఓటమి

జపాన్ ఓపెన్ -2023లో భారత షట్లర్ లక్ష్య సేన్ సెమీ ఫైనల్లో ప్రవేశించాడు. నేడు జరిగిన క్వార్టర్ ఫైనల్స్ పురుషుల సింగిల్స్ మ్యాచ్ లో జపాన్ ప్లేయర్ కొకి వతానబే పై 21-15; 21-19 తేడాతో గెలుపొంది టాప్ -4 లో బెర్త్ సంపాదించాడు.

మరో మ్యాచ్ లో హెచ్ ఎస్ ప్రణయ్ ఓడిపోయాడు. విక్టర్ ఆక్సెల్ సేన్ 19-21 21-18;  21-8తో గెలుపొందాడు. హోరాహోరీగా సాగిన మ్యాచ్ లో తొలి సెట్ ను ప్రణయ్ గెల్చుకోగా, రెండో సెట్ విక్టర్ సొంతం చేసుకున్నాడు. మూడో సెట్ లో విక్టర్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి విజయం సాధించాడు.

పురుషుల డబుల్స్ మ్యాచ్ లో సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి జోడీ ఓటమి పాలయ్యారు. తైపీ ద్వయం లీయాంగ్ – వాంగ్ చీ-లిన్ చేతిలో 21-15; 23-25; 21-14తో పరాజయం చెందారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular