Saturday, March 14, 2026
Homeస్పోర్ట్స్Yonex French Open 2022: తొలి రౌండ్ లో లక్ష్య సేన్- కిడాంబి పోరు

Yonex French Open 2022: తొలి రౌండ్ లో లక్ష్య సేన్- కిడాంబి పోరు

బ్యాడ్మింటన్ ఫ్రెంచ్ ఓపెన్ -2022 నేటినుంచి ప్రారంభం కానుంది. నేడు జరిగే పోటీల్లో మహిళల సింగిల్స్ లో సైనా నెహ్వాల్, డబుల్స్ లో త్రెసా జాలీ- గాయత్రి గోపీచంద్; పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి ద్వయం; మిక్స్డ్ డబుల్స్ లో ఇషాన్ భట్నాగర్- తానీషా క్రాస్టో లు తమ ప్రత్యర్థులతో తలపడనున్నారు.

కాగా, పురుషుల సింగిల్స్ లో మన దేశానికే చెందిన స్టార్ ప్లేయర్లు లక్ష్య సేన్- కిడాంబి శ్రీకాంత్ తో తొలి రౌండ్ లోనే తలపడనున్నారు. గత వరం ముగిసిన డెన్మార్క్ ఓపెన్ లో కూడా ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లో సేన్ మన దేశానికే చెందిన ప్రణయ్ ను ఓడించి క్వార్టర్స్ లోకి ప్రవేశించి అక్కడ ఓటమి పాలయ్యాడు. కిడాంబి శ్రీకాంత్ ప్రీ క్వార్టర్స్ లోనే వెనుదిరిగాడు.  పురుషుల సింగిల్స్ లో సమీర్ వర్మ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకొనున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular