Friday, April 19, 2024
HomeTrending Newsతెలంగాణలో రియల్ ఎస్టేట్ మాఫియా

తెలంగాణలో రియల్ ఎస్టేట్ మాఫియా

రాష్ట్రంలో రక్షణ కరువయిందని, కిడ్నాప్ లు,హత్యలు మామూలు అయిపోయాయని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత రేణుక చౌదరి ఆందోళన వ్యక్తం చేశారు. ల్యాండ్ డీల్స్ కు తెలంగాణ కేంద్రంగా మారిందన్నారు. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని హైదరాబాద్ లో ఈ రోజు రేణుక చౌదరి డిమాండ్ చేశారు. ధరణి పోర్టల్ సృష్టించిన ఇబ్బందుల వల్ల రైతులు నష్ట పోతున్నారని, వేల మంది రైతులు వచ్చి తమ సమస్యలు చెప్పుకుంటుంన్నారని వాపోయారు. ఎప్పుడో అమ్మిన భూముల యాజమాన్య హక్కులు మారడం లేదని, దీంతో రియల్ ఎస్టేట్ మాఫియా రైతులపై దౌర్జన్యం చేస్తోందన్నారు. తెలంగాణ స్టార్టప్ అంటే ఇదేనా…అన్న రేణుక చౌదరి టెక్నాలజీ మంచిదే కానీ అదే టెక్నాలజీ ఇన్ని ఇబ్బందులు సృష్టిస్తుందన్నారు. ఇలా అయితే అందరూ కిడ్నాప్ లు,మర్డర్ లు చేస్తారని, గతంలో ఇంటర్ పరీక్షా ఫలితాలు కూడా తప్పుల తడకేనని…అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

అమరావతి లో న్యాయం గెలిచిందని, రైతుల పోరాటంతోనే ఇది సాధ్యమైందన్నారు. రైతుల పాదయాత్రతో దేవుడు కరుణించాడని రేణుక చౌదరి చెప్పారు. తిరుమల వెంకన్న,కనకదుర్గ ఆశీస్సులు అరావతి రైతులకు ఉన్నాయన్నారు. రైతుల పోరాటం కు కోర్ట్ తీర్పుతో సరైన న్యాయం జరిగిందని, ప్రభుత్వం ఈ తీర్పుపై అప్పీల్ కు వెళితే .. రైతుల తరుపున మేము కూడా అప్పీల్ కు వెళతామని రేణుక చౌదరి స్పష్టం చేశారు.

Also Read : మంత్రి హత్య కేసులో రాజకీయ కుట్ర – బిజెపి

RELATED ARTICLES

Most Popular

న్యూస్