మహిళల టి 20వరల్డ్ కప్ లో శ్రీలంక వరుసగా రెండో విజయం సాధించింది. టోర్నీ ఆరంభ మ్యాచ్ లో ఆతిథ్య సౌతాఫ్రికా ను ఓడించిన లంక మహిళలు నేటి రెండో మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై 7వికెట్లతో ఘన విజయం సాధించింది.
కేప్ టౌన్ లోని న్యూ లాండ్స్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో బంగ్లా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. శోభన మాస్త్రీ-29; కెప్టెన్ నైగర్ సుల్తానా-28; షమీనా సుల్తానా-20 పరుగులు చేశారు. నిర్ణీత 20ఓవర్లలో 8 వికెట్లకు 126 పరుగులు చేసింది.
లంక బౌలర్లలో ఓషాది రణసింఘే 3; కెప్టెన్ ఆటపట్టు 2; రణవీర ఒక వికెట్ పడగొట్టారు.
శ్రీలంక 25 పరుగులకే మూడు వికెట్లు (కెప్టెన్ ఆటపట్టు-15; గుణరత్నే-1; అనుష్క సంజీవని డకౌట్) కోల్పోయినా మరో ఓపెనర్ హర్షిత మాధవి-69 (50 బంతుల్లో 8 ఫోర్లు, 1సిక్సర్)- నీలాక్షి డిసిల్వా -41 (38 బంతుల్లో 2 ఫోర్లు) నాలుగో వికెట్ కు అజేయంగా 104 పరుగులు జోడించి 18.2 ఓవర్లలో విజయం అందించారు.
హర్షిత మాధవి కి ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.
Also Read : Women’s T20 WC: ఆరంభ మ్యాచ్ లో లంక విజయం