Monday, January 20, 2025
HomeTrending NewsNepal: పశుపతినాథ్‌ ఆలయంలో 10 కిలోల బంగారం చోరి

Nepal: పశుపతినాథ్‌ ఆలయంలో 10 కిలోల బంగారం చోరి

నేపాల్‌లోని ప్రముఖ హిందూ దేవాలయమైన పశుపతినాథ్‌ ఆలయంలో 10 కిలోల బంగారం మాయమైంది. దీంతో రంగంలోకి దిగిన అ దేశ అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని తనిఖీలు నిర్వహించారు. ఆదివారం కొన్ని గంటల పాటు ఆలయంలో దర్శనాలను ఆపేశారు.

గత ఏడాది మహా శివరాత్రి సమయంలో శివ లింగానికి 103 కిలోల బంగారంతో జలహరి అనే ఆభరణాన్ని అలంకరించారు. జలహరి నాణ్యత, బరువుపై కూడా పలు ఆరోపణలు రావడంతో దీనిని కూడా పరిశీలిస్తున్నట్టు అవినీతి నిరోధక శాఖ అధికారులు తెలిపారు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్