Sunday, February 23, 2025
Homeసినిమా'కాంచన 4'లో కథానాయికలు ఎవరబ్బా?

‘కాంచన 4’లో కథానాయికలు ఎవరబ్బా?

హారర్ థ్రిల్లర్ .. హారర్ కామెడీ సినిమాలకు డిమాండ్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఈ తరహా కథలను చిన్నపిల్లల నుంచి పెద్దవారు వరకూ ఇష్టపడటమే అందుకు కారణం. సాధారణంగా ఈ జోనర్ లో సినిమాలు చూడటానికి చాలామంది భయపడతారు. అలా అని చెప్పి చూడటం మానరు. ఇతరులతో కలిసి చూస్తూ ఉంటారు. అందువల్లనే హారర్ కంటెంట్ ఉన్న సినిమాలు మంచి వసూళ్లనే రాబడుతున్నాయి. ఇటీవల ప్రేక్షకులను పలకరించిన ‘స్త్రీ’ సాధించిన విజయమే అందుకు ఓ ఉదాహరణ.

ఈ నేపథ్యంలో లారెన్స్ ‘కాంచన 4’ను పట్టాలెక్కించే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. గతంలో లారెన్స్ నుంచి వచ్చిన ‘కాంచన’ సిరీస్ భారీ వసూళ్లను రాబడుతూ వెళ్లాయి. ‘కాంచన 3’ తరువాత లారెన్స్ కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఈ మధ్యలో ఆయన ‘చంద్రముఖి 2’ చేశాడు గానీ, అది మ్యాజిక్ చేయలేకపోయింది. ప్రస్తుతం ఆయన ‘బెంజ్’ సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత ఆయన ‘కాంచన 4’ను సెట్స్ పైకి తీసుకుని వెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడని అంటున్నారు.

ఈ సినిమాను గోల్డ్ మైన్ ప్రొడక్షన్స్ పై మనీశ్ నిర్మించనున్నట్టు తెలుస్తోంది. కథానాయిక ఎవరనేది హాట్ టాపిక్ గా మారింది. ఇంతవరకూ హారర్ కంటెంట్ ను టచ్ చేయని స్టార్ హీరోయిన్ ను తీసుకోవాలని లారెన్స్ భావిస్తున్నాడట. ప్రస్తుతానికైతే కీర్తి సురేశ్ .. రష్మిక పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేయవచ్చని అంటున్నారు. కానీ అధికారిక ప్రకటన వస్తే తప్ప నమ్మలేం. చూడాలి మరి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రత్యేకతలు .. విశేషాలు ఏమిటో!

RELATED ARTICLES

Most Popular

న్యూస్