Tuesday, June 16, 2026
Homeసినిమాఈ నెల 24న నెట్ ఫ్లిక్స్ లో 'లియో'..

ఈ నెల 24న నెట్ ఫ్లిక్స్ లో ‘లియో’..

ఇప్పుడు ఎంత పెద్ద సినిమా అయినా .. ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా, నెల దాటగానే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వస్తూనే ఉన్నాయి. కొన్ని సినిమాలు నెల తిరగక ముందే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై ప్రత్యక్షమవుతున్నాయి. ఈ విషయంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పోటీ పడుతున్నాయి .. ఎక్కువ ఉత్సాహాన్ని చూపిస్తున్నాయి. భారీ సినిమాలను సైతం చకచకా వదులుతున్నాయి. అలా విజయ్ సినిమా ‘లియో’ కూడా ఈ నెల 24న ఓటీటీ ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

విజయ్ – లోకేశ్ కానగరాజ్ కాంబినేషన్లోని ఈ సినిమా, అక్టోబర్లో థియేటర్లకు వచ్చింది. అటు తమిళంలోను .. ఇటు తెలుగులోను భారీ అంచనాల మధ్య ఈ సినిమా విడుదలైంది. లోకేశ్ కనగరాజ్తన గత చిత్రాల మాదిరిగానే, ఈ కథను కూడా యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ ఎమోషన్స్ చుట్టూ తిప్పాడు. భారీతారాగణం పరంగా ఈ సినిమా మంచి మార్కులు కొట్టేసింది. కానీ కథగా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. కంటెంట్ పట్ల కొంత అసంతృప్తి ఆడియన్స్ వైపు నుంచి వ్యక్తమైంది.

మాఫియా నేపథ్యం ఉన్న హీరో .. దాని నుంచి బయటపడి, తన ఫ్యామిలీతో సంతోషకరమైన జీవితాన్ని గడపాలనుకుంటాడు. అయితే అతని ఆనందకరమైన జీవితానికి అడ్డుతగులుతూ మాఫియా ముఠా ఎంటరవుతుంది. అప్పుడు హీరో ఏం చేస్తాడు? ఫలితంగా అతని ఫ్యామిలీ ఎలాంటి చిక్కుల్లో పడుతుంది? అనే దిశగా కథ నడుస్తుంది. విజయ్ కి ఉన్నక్రేజ్ కారణంగా మంచి వసూళ్లనే రాబట్టిన ఈ సినిమా, ఓటీటీ వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ ను తెచ్చుకుంటుందనేది చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular