Tuesday, April 16, 2024
Homeసినిమాచిరు, పూరి మూవీ ఉన్నట్టా..? లేనట్టా..?

చిరు, పూరి మూవీ ఉన్నట్టా..? లేనట్టా..?

చిరంజీవి, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ‘ఆటోజానీ’ అనే సినిమా అనుకోవడం.. ఆ సినిమా సెట్స పైకి వెళ్లకుండానే ఆగిపోవడం తెలిసిందే. చిరంజీవితో సినిమా చేయాలనేది పూరి డ్రీమ్. ఎప్పటికైనా చిరంజీవితో సినిమా చేస్తానని చెప్పారు. మెగా అభిమానులు కూడా ఈ క్రేజీ కాంబినేషన్లో మూవీ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల ‘గాడ్ ఫాదర్’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవిని పూరి ఇంటర్ వ్యూ చేశారు. ఈ ఇంటర్ వ్యూలో చిరంజీవి, పూరిని కథ రెడీ చేయ్ మనం సినిమా చేద్దామని చెప్పారు. దీనికి పూరి కూడా మీ కోసం పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేస్తున్నాని చెప్పడం జరిగింది.

అప్పటి నుంచి ఈ క్రేజీ కాంబో మూవీ ఎప్పుడెప్పుడు అనౌన్స్ చేస్తారా..? అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే.. ఎంతకీ ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయకపోవడం.. పూరి చిరంజీవితో కాకుండా తనయుడు ఆకాష్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వస్తుండడంతో చిరు, పూరి ప్రాజెక్ట్ ఉందా..? లేదా..? అనేది ఆసక్తిగా మారింది. ఇదిలా ఉంటే.. ‘వాల్తేరు వీర‌య్య‌’ మూవీతో చిరంజీవి బ్లాక్ బస్టర్ సాధించారు. చిరు అభిమానులు ఎప్ప‌టి నుంచో ఎదురు చూస్తున్న హిట్ ఇది. ఈ విజ‌యం చిరంజీవిలో కూడా ఆత్మ‌విశ్వాసాన్ని పెంచి ఉంటుంది.

త‌ను ఎలాంటి క‌థ‌లు చేయాల‌న్న విష‌యంలో ఓ క్లారిటీ వ‌చ్చి ఉంటుంది. త‌న‌ పై మాస్‌, క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌లు ఇప్ప‌టికీ వ‌ర్క‌వుట్ అవుతాయ‌న్న న‌మ్మ‌కం క‌లిగింది. ఇప్పుడు చిరు దృష్టి మాస్ ద‌ర్శ‌కుల‌ పై ప‌డుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. అందుచేత పూరికి ఇది మంచి ఛాన్స్. ఈ టైమ్ లో చిరంజీవికి తగ్గట్టుగా ఓ మాంచి మాస్ స్టోరీ చెబితే ఖచ్చితంగా చిరంజీవి ఓకే చెబుతారు. ఇంకా చెప్పాలంటే.. ఇప్పుడు త‌న ముందు చిరు రూపంలో మంచి అవ‌కాశం ఉంది. మ‌రి.. పూరి ఏం చేస్తాడో అనేది ఆసక్తిగా మారింది. త్వరలోనే ఈ క్రేజీ మూవీ గురించి క్లారిటీ వస్తుందేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్