Wednesday, June 17, 2026
HomeసినిమాLGM: 'ఎల్ జి ఎమ్' ఎక్కడా కనెక్ట్ కాలేదే!

LGM: ‘ఎల్ జి ఎమ్’ ఎక్కడా కనెక్ట్ కాలేదే!

Mini Review: ఇవానకి తెలుగులో మంచి క్రేజ్ ఉంది. ‘లవ్ టుడే’తో ఇక్కడి యూత్ ను కట్టిపడేసిన ఈ బ్యూటీ, ఆ సినిమాతో ఇక్కడి నుంచి హిట్ పట్టుకుపోయింది. అప్పటి నుంచి ఆమె నెక్స్ట్ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తూనే ఉన్నారు. తెలుగులో నేరుగా ‘సెల్ఫిష్’ అనే సినిమా చేసినప్పటికీ, అది ఇంకా విడుదల కాలేదు. అప్పటి వరకూ వెయిట్ చేయవలసిందేనా? అంటూ నీరసించిపోయిన ఇవాన అభిమానుల ముందుకు నిన్న ‘ఎల్ జీ ఎమ్’ సినిమా వచ్చింది. ధోని సొంత బ్యానర్ నుంచి వచ్చిన ఫస్టు సినిమా ఇదే కావడం విశేషం.

కాబోయే అత్తా కోడళ్లకు ఒకరి అభిప్రాయాలు .. అభిరుచులు ఒకరికి ముందుగానే తెలియాలనే ఒక కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమా థియేటర్లకు వచ్చింది. పాయింట్ బాగుంది .. సినిమా చాలా సరదాగా ఉంటుందని అనిపించడం సహజం. కానీ ఏదో చేయబోతే ఏదో అయిందన్నట్టుగా ఈ సినిమా ఆడియన్స్ ను ఒక ఆట ఆడుకుని వదిలిపెడుతుంది. మొదటి నుంచి చివరి వరకూ కొత్తగా ఏం జరుగుతుందా అనే ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉంటారు. చివరికి నిరాశా జీవిగానే బయటికి వస్తారు.

ఆర్టిస్టుల పరంగా ఎలాంటి సమస్యా లేదు .. అందరూ నటన పరంగా చాలా పాఠాలు తిరగేసినవారే. ఆడియన్స్ లో అంతో .. ఇంతో క్రేజ్ ఉన్నవారే. కానీ ఆ కథపై సరైన కసరత్తు జరగనప్పుడు ..  పాత్రలను సరిగ్గా డిజైన్ చేయనప్పుడు వాళ్ల హెయిర్ స్టైల్ .. మేకప్పు గురించి పట్టించుకునే స్థాయికి ప్రేక్షకులు వెళ్లిపోతారు. ధోని బ్యానర్ గనుక నిర్మాణ విలువల గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. పాయింట్ బాగుందనే వాళ్లు కూడా ఒప్పుకుని ఉంటారు. కాకపోతే ఆ పాయింటును రెండున్నర గంటల పాటు లాగడమే కుదరలేదంతే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular