Saturday, January 18, 2025
Homeసినిమాచిరు, స‌ల్మాన్ ఆశీస్సులు తీసుకున్న లైగ‌ర్

చిరు, స‌ల్మాన్ ఆశీస్సులు తీసుకున్న లైగ‌ర్

పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జగన్నాథ్ ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లైగర్. సాలా క్రాస్ బ్రీడ్ అనేది ట్యాగ్ లైన్. ఇందులో విజ‌య్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే న‌టించింది. ది గ్రేట్ మైక్ టైస‌న్ ఈ మూవీలో కీల‌క పాత్ర పోషించ‌డం విశేషం. ఆగ‌ష్టు 25న లైగ‌ర్ మూవీని వ‌ర‌ల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇటీవల విడుదలైన ట్రైలర్, రెండు సింగిల్స్ అక్డీ పక్డీ, వాట్ లగా దేంగే సినిమాపై మంరింత హైప్ ని క్రియేట్ చేశాయి. దేశం మొత్తం ఎదురుచూస్తున్న ఈ చిత్ర ప్రమోషన్స్ ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. మొన్న విజయ్ దేవరకొండ, లైగర్ టీమ్ ముంబైలోని ఒక మాల్‌కి వెళ్లారు. బాలీవుడ్ ప్రెస్, ట్రేడ్‌ను ఆశ్చర్యపరిచే విధంగా ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సెట్‌ను ‘లైగర్‘ టీమ్ సందర్శించింది. అక్కడ వేసిన ప్రత్యేక సెట్‌లో చిరంజీవి, సల్మాన్‌ ఖాన్‌ల పై స్పెషల్ సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు. తమ సినిమా కోసం ఇద్దరు సూపర్ స్టార్ల ఆశీస్సులు తీసుకుంది లైగర్ టీమ్. పూరి కనెక్ట్స్, బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Also Read :  ‘లైగర్’ నుండి ‘వాట్ లాగా దేంగే’ విడుదల 

RELATED ARTICLES

Most Popular

న్యూస్