‘లైగర్’ నుండి ‘వాట్ లాగా దేంగే’ విడుదల

పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ, పాత్ బ్రేకింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ”లైగర్”(సాలా క్రాస్‌బ్రీడ్) ఆగస్ట్ 25న విడుదల కానుంది. ది గ్రేట్ మైక్ టైసన్ లైగర్ సినిమాతో ఇండియన్ సినిమాలో అరంగేట్రం చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఈ చిత్రంపై భారీ హైప్, అంచనాలను పెంచింది. దేశం మొత్తం ఎదురుచూస్తున్న చిత్రంగా నిలిచింది. ఫస్ట్ సింగిల్ ‘ అక్డీ పక్డీ ‘ వైరల్‌గా మారి మ్యూజిక్ చార్ట్‌లలో టాప్ ట్రెండింగ్‌లో ఉంది. ప్రస్తుతం ఫస్ట్ సింగిల్, ట్రైలర్ దేశ వ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉన్నాయి.

ట్రైలర్ సూపర్ సక్సెస్ తర్వాత చిత్ర యూనిట్ ‘వాట్ లగా దేంగే’ అనే థీమ్ సాంగ్ ను విడుదల చేసింది. ఈ థీంమ్ సాంగ్ లైగర్ స్వాగ్, యాటిట్యుడ్ ని ఆవిష్కరించింది. స్లమ్‌డాగ్ నుండి ఎంఎంఏ ఫైటర్ గా దేశానికి ప్రాతినిధ్యం వహించే జర్నీ గ్లింప్స్ విజువల్స్ బ్రిలియంట్ గా వున్నాయి. “వీ ఆర్ ఇండియన్స్.. హమ్ కిసీసే కమ్ నహీ” .. “వాట్ లగా దేంగే… ఆగ్ హే అందర్” అని ఈ థీమ్ సాంగ్ లో లైగర్ చెప్పిన మాటలు పవర్ ఫుల్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేశాయి. మ్యూజికల్ గా విజువల్ గా ‘వాట్ లాగా దేంగే’ షేక్ చేస్తోంది.

పూరి కనెక్ట్స్ , బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. విష్ణు శర్మ సినిమాటోగ్రాఫర్‌గా, థాయ్‌లాండ్‌కు చెందిన కెచా స్టంట్ మాస్టర్ గా ఈ చిత్రానికి పని చేస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Also Readవిజ‌య్ సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అవుతుందా..? 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *