Friday, November 22, 2024
HomeTrending Newsగోయల్ కు లైన్ క్లియర్ – డైలామాలో రంజన్ దా

గోయల్ కు లైన్ క్లియర్ – డైలామాలో రంజన్ దా

పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పక్షాలు నేతలకు బాధ్యతలపై స్పష్టత ఇస్తున్నాయి. కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నేత పియూష్ గోయల్ రాజ్యసభలో సభ పక్ష నేతగా నియమితులయ్యారు. ప్రస్తుతం పెద్దల సభలో పార్టీ ఉపనాయకుడిగా గోయల్ వ్యవహరిస్తున్నారు. ఇటీవలే థాపర్ చంద్ గేహ్లేట్ కర్నాటక గవర్నర్ గా వెళ్ళటంతో ఎగువ సభాపక్ష నాయక పదవి ఖాళీగా ఉంది. సభా వ్యవహారాలపై పట్టున్న కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ సభా నాయకత్వం వహిస్తారని పార్టీ వర్గాలు భావించాయి. కేంద్ర మంత్రిగా అనుభవం, ప్రతిపక్షాలతో కలుపుగోలుతనం, త్రిపుల్ తలాక్, 370 ఆర్టికల్ రద్దు బిల్లు సభలో ఆమోదం పొందటంలో ఉపనాయకుడిగా గోయల్ కీలక పాత్ర పోషించారు. మహారాష్ట్ర కు చెందిన పియూష్ గోయల్ వివాదరహితుడు. గోయల్ కు మంత్రి వర్గంలో అదనపు శాఖలు ఇవ్వటం, ఎగువ సభ నాయకత్వ పదవి వెరసి రాబోయే కాలంలో శివసేన తో పాత దోస్తీకి ఉపయోగ పడుతుందని పార్టీ వర్గాలు అంచనాతో ఉన్నాయి.

మరోవైపు లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడిగా అధీర్ రంజన్ చౌదరి కొనసాగుతారని పార్టీ వర్గాల సమాచారం. ఒక వ్యక్తికి ఒకే పదవి సిద్దాంతం కాంగ్రెస్ లో ఉంది. పశ్చిమ బెంగాల్ పిసిసి అధ్యక్షుడిగా ఉన్న అధీర్ ఇటీవలి ఎన్నికల్లో వైపల్యం చెందారని అధిష్టానం గుర్రుగా ఉంది. మమత బెనర్జీ తో దీర్ఘ కాల విభేదాలు ఉన్న రంజన్ దా  తృణముల్ కాంగ్రెస్ తో పొత్తుకు విముఖం చూపారు. దీంతో గతంలో ఉన్న అసెంబ్లీ సీట్లు కూడా తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ కోల్పోయింది. ఎన్నికల వ్యుహకర్త ప్రశాంత్ కిశోర్ రెండు రోజుల క్రితం సోనియా, రాహుల్, ప్రియాంక లతో నిర్వహించిన ఆన్లైన్ మీటింగ్ లో అధీర్ వ్యవహారం ప్రస్తావించినట్టు సమాచారం. పార్లమెంటు సమావేశాలు మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్న దృష్ట్యా రంజన్ దా ను ఈ సమావేశాల వరకు కొనసాగిస్తారా? రెండు రోజుల్లో మరొకరికి బాధ్యతలు అప్పగిస్తారా వేచిచూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్