Saturday, January 18, 2025
HomeTrending Newsఏలూరులో కూడా కల్తీ సారా: చినరాజప్ప

ఏలూరులో కూడా కల్తీ సారా: చినరాజప్ప

illicit liquor: జంగారెడ్డిగూడెంతో పాటు ఏలూరు లో కూడా కల్తీ సారా మరణాలు జరుగుతున్నాయని, ఈరోజు ఏలూరులో 15 కేసులు బైట పడ్డాయని  టిడిపి ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు.  పశ్చిమ గోదావరి జిల్లాలో కల్తీ, నాటు సారా మాఫియా  రాజ్యమేలుతోందని, మొత్తం 100 మంది వరకూ ఈ బారిన పడ్డారని  ఆరోపించారు. గూడెంలో  26 మంది మరణించారని, దీనిపై 13 ఎఫ్ ఆర్ ఐ లు నమోదయ్యాయని, ఇవన్నీ కల్తీ, నాటు సారా తాగడం వల్లే జరిగాయని అధికారులు నిర్ధారిస్తే సిఎం జగన్  మాత్రం వీటిని సహజ మరణాలుగా చెప్పడం దారుణమన్నారు.  నేడు నాలుగోరోజు కూడా టిడిపి సభ్యులు జంగారెడ్డి గూడెం సంఘటనపై అసెంబ్లీ కార్యకలాపాలను అడ్డుకున్నారు.  టిడిపి సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం ఒకరోజు పాటు వారిని సస్పెండ్ చేశారు. అనంతరం టిడిపి ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ… తమను సస్పెండ్ చేయడంతో పాటు మార్షల్స్ తో బైటకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం మార్షల్స్ ద్వారా అసెంబ్లీ నడిపించుకుంటోందని ఎద్దేవా చేశారు.  నాటుసారా ద్వారా రాష్ట్రంలో పెద్ద కుంభకోణం జరుగుతోందని,  దీనిపై విచారణ జరిపించాలని చినరాజప్ప డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో కల్తీ సారా ప్రధాన సమస్య అయితే దానిపై చర్చించకుండా అసెంబ్లీ నుంచి నాలుగో రోజు కూడా తమను సస్పెండ్ చేయడం దారుణమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ అన్నారు. నాటు సారా వల్లే మృతి చెందారని వైద్యుల నివేదిక స్పష్టం చేస్తున్నా ప్రభుత్వం కాదని చెప్పడం సరికాదన్నారు. దీనిపై అసెంబ్లీలో ప్రస్తావిద్దమంటే మార్షల్స్ తో తమను బైటకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  తాము ఎమ్మెల్యేలం పది మంది ఉంటే మార్షల్స్ 50 మంది ఉన్నారని, సభలో తమ వాణి వినిపించే అవకాశం లేనందునే మీడియా ద్వారా చెబుతున్నామని భవానీ వివరించారు.

Also Read : కనీస విచారణ జరిపించరా?: అచ్చెన్న

RELATED ARTICLES

Most Popular

న్యూస్