Sunday, January 19, 2025
HomeTrending Newsతెలుగు భాషను కాపాడుకుందాం - విద్యాసాగర్ రావు

తెలుగు భాషను కాపాడుకుందాం – విద్యాసాగర్ రావు

అంతర్జాతీయ మాతృ భాష దినోత్సవం సందర్బంగా అక్షర యాన్ ఆధ్వర్యంలో బేగంపేట్ లోని హరిత ప్లాజా హోటల్ లో కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథి గా
మహారాష్ట్ర పూర్వ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు పాల్గొని ప్రసంగించారు. తొలి ఐదేళ్లు మాతృ భాషలో చదివిన వాళ్లే మేధావి అయ్యారని చెప్పారు.
రాజకీయాల్లో తిట్లు సరి కాదన్నారు. పిల్లలపై ప్రభావం చూపుతుందన్నారు.

ప్రతి ఊర్లో, ప్రతి పాఠశాలలో మాతృ భాషను నిర్లక్ష్యం చేయరాదన్నారు. తెలుగు రాష్ట్రాల్లో  తెలుగు భాషను 5 తరగతుల వరకు తప్పనిసరి చేయాలని ఇరు రాష్ట్రాల ముఖ్య మంత్రులకు విద్యాసాగర్ రావు సూచించారు. తెలుగు అంతర్జాతీయ విశ్వ విద్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు. కరోనా, ఓమిక్రాన్ వంటి సమయాల్లో గ్రామీణ ప్రజలకు సాంకేతిక ద్వారా మాతృ భాషలో అవగాహన ఏర్పడిందన్నారు. అలా మాతృ భాష ఆవశ్యకత గురించి వివరించారు. ఈ సందర్బంగా ఆంధ్రజ్యోతి సంపాదకులు కే. శ్రీనివాస్ కు పంపన కవి పురస్కాకరంతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జేడీ వీవీ లక్ష్మి నారాయణ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ఉపాధ్యక్షులు తంగెడ కిషన్ రావు, ఐనంపూడి శ్రీలక్ష్మి, చాలామంది తెలుగు కవులు కవయిత్రులు పాల్గొన్నారు.

Also Read : ఏదీ నాటి తెలుగు వైభవం?

RELATED ARTICLES

Most Popular

న్యూస్