Sunday, February 23, 2025
Homeసినిమాడిసెంబర్ మొదటి వారంలో ‘లాక్ డౌన్ ద ప్యాండమిక్’

డిసెంబర్ మొదటి వారంలో ‘లాక్ డౌన్ ద ప్యాండమిక్’

Lock-down The Pandemic:
శ్రీకాంత్, హ్రితిక, బాలు, అపూర్వ, తేజందర్ సింగ్, ఆశీ రాయ్, జబర్దస్త్ రాకేష్, బస్టాప్ సాయి కుమార్, బాలాజీ తదితరులు నటిస్తున్న చిత్రం ‘లాక్ డౌన్ ద ప్యాండమిక్’. సిరాజ్ నిర్మాతగా వ్యవహరిస్తూనే, దర్శకత్వం బాధ్యతలు స్వీకరించారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ మొదటి వారంలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ఈ సంద‌ర్భంగా ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ “డిసెంబర్ మొదటివారంలో ‘లాక్ డౌన్’ చిత్రాన్ని థియేటర్లో, ఓటిటిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. డైరెక్టర్ సిరాజ్ గతంలో చాలా సినిమాలు నిర్మించాడు. దర్శకుడుగా సిరాజ్ ఈ సినిమాలో లవ్, సస్పెన్స్, థ్రిల్లర్ ను చాలా చక్కగా డీల్ చేశాడు. నిర్మాతగా సక్సెస్ అయిన తను దర్శకుడుగా ఈ సినిమాతో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను” అన్నారు.

“మా దర్శక నిర్మాత సిరాజ్ ‘లాక్ డౌన్’ వంటి మంచి సినిమా తీశారు. సినిమా ఔట్ ఫుట్ చూశాం. లవ్, సస్పెన్స్, థ్రిల్లర్ బాగా పండింది. ఇలాంటి మంచి చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన సిరాజ్ గారికి ధన్యవాదాలు” అని హీరోహీరోయిన్లు అన్నారు.

దర్శక,నిర్మాత సిరాజ్ మాట్లాడుతూ “నేను ప్రొడ్యూస్ చేసిన సినిమాలను ఆదరించినట్లే ఇప్పుడు తీసిన‌ లవ్, సస్పెన్స్, థ్రిల్లర్ లాక్ డౌన్ ది ప్యాండమిక్ సినిమాను ఆదిరిస్తాని ఆశిస్తున్నాను. ఈ చిత్రాన్ని డిసెంబర్ మొదటి వారంలో థియేటర్, ఓటిటిలో విడుదల చేయబోతున్నాం. మా చిత్రాన్ని, మా టీంను ప్రేక్షకులు ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను” అన్నారు.

Also Read : పడిలేచిన కెరటం

RELATED ARTICLES

Most Popular

న్యూస్